సిగ్గుపడాలి

రంగుల ప్రపంచం
రంగురంగుల కలలు
ముఖానికే కాదు మనస్సు కూడా
ఆడది..ఎక్కడై
నా అంగటి వస్తువు
తరాలు మారినా..వ్యవస్థలో ఆ బిరుదు శాశ్వతం
నీ అవసరాన్ని సొమ్ము చేసుకునే వ్యవస్థ
నీ అమాయక చూపులతో కన్ను కొట్టించే లోకం
బతుకు కోసం బరితెగించేలా చేసే మృగాళ్ల మధ్య
నువ్వు పోరాడింది..పోరాడుతున్నది
ఎందరో కృష్ణానగర్‌ వాసులకు నమ్మకం కలిగించింది
ధైర్యం నింపింది...భరోసా కల్పించింది
నువ్వు ఎందరి చేతిలో నలిగిపోయావు
మరెందరో నిన్ను పూజకు పనికిరాని పువ్వును చేశారు
ఇన్నేళ్ల కళామతల్లి పేరు చెప్పి నటులుగా ఎదిగిన వారిలో
కొందరు విటులున్నారని నగ్న చిత్రాన్ని చూపించావు
నువ్వు బట్టలు విప్పితే బూతు అన్నారు..
బరి తెగించావ్‌ అన్నారు...బజారు మనిషివీ అన్నారు
అనేవాళ్లు అనని..విమర్శించేవాళ్లు విమర్శించనే
ఎగతాలి చేసే వారు చేయనే..
భరించావు..బావురమన్నావు..చేయకూడనవీ చేశావు
సర్వం నీ శరీరాన్ని అర్పించావు..
అందుకే ఈ భ్రష్టు పట్టిన 'చిత్రాన్ని' సూపర్‌ హిట్‌ చేయాలనుకున్నావ్‌
ఆ నలుగురు..'మా' అనుకునేవాళ్లను కడిగేశావ్‌
ప్రపంచం మొత్తం నీ నగ్న చిత్ర భావాన్ని అర్థం చేసుకుంది
నువ్వు కెమేరాల ముందు వివస్త్రగా మారి నీ అసహనాన్ని
కళ్లారా చూసింది.. నువ్వు ఇప్పుడొక స్టార్‌వి..
అవకాశాలు లేని..అవకాశాలు ఇవ్వలేని కళామతల్లి తల్లి బిడ్డవి
కళను నమ్మి పడక గదిలో నలిగిపోయే ఎందరికో
నీవు ఆశాదీపానివి..

Comments

  1. 888 Casino, BW Premier Hotel & Spa - Mapyro
    Get directions, reviews and information for 888 나주 출장샵 Casino, BW Premier Hotel & Spa 여수 출장안마 in BW 거제 출장마사지 Premier, BW Premier Hotel & Spa, BW 하남 출장안마 Premier 양주 출장마사지 Hotel & Spa, BW Premier

    ReplyDelete

Post a Comment