ఫిట్‌ అండ్‌ హాట్‌

శ్రీదేవి కూతురు జాహ్నవి...నిత్యం వార్తలో ఉండే గ్లామర్‌ డాల్‌. స్క్రీన్‌ మీద కాకుండా ఔట్‌ ఆఫ్‌ స్క్రీన్‌పై అమ్మడు అందాల ఆరబోతలో ఎటువంటి అడ్డు చెప్పడం లేదు. డ్రెస్‌ సెన్స్‌ కూడా చాలా హాట్‌ హాట్‌గా ఉంటుంది. ఎంత 'ఫిట్టుగా' ఉంటే అంత హాటు! గ్లామర్‌ ఫీల్డ్‌ లో ఇదే లేటెస్ట్‌ సక్సెస్‌ ఫార్ములా! అందుకే.. సినిమా హీరోయిన్లు ఫిట్‌ నెస్‌ కోసం రేయింబవళ్లు చెమటోడుస్తున్నారు. 'జిమ్ములో నేను' అంటూ సోషల్‌ విూడియాలో ఫొటోలు, వీడియోలు పెట్టి ఎగస్ట్రా పబ్లిసిటీ కొట్టేయడం కూడా ఇవ్వాల్టి హీరోయిన్లకే చెల్లింది. శ్రీదేవి కూతురు జాహ్నవి (ఝాన్వి) కూడా అదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతోంది. ముంబైలో ఒక ఫేమస్‌ ఫిట్నెస్‌ సెంటర్‌ కి వెళ్లి రోజూ అటెండెన్స్‌ వేయించుకుంటున్న జానూ.. తన లేటెస్ట్‌ జిమ్‌ ఫొటోల్ని బైటికొదిలింది. 
నిండా ఇరవై కూడా నిండని జాహ్నవి.. ఫిజిక్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోందని.. ముద్దుల మమ్మీ శ్రీదేవి మొన్నీమధ్యే కాంప్లిమెంట్‌ ఇచ్చింది. పైగా తనే దగ్గరుండిమరీ.. జాహ్నవిని 'తయారు' చేస్తోందట. ఎలాగైనా తల్లిపేరు నిలబెట్టాలన్న 'కసి' కూడా జాహ్నవిని బాగా కష్టపెడుతోంది. కానీ.. శరీరాన్ని మెరుపుతీగలా, నాజూగ్గా రూపొందించుకోకుండా తల్లిలాగే బొద్దుగా తయారవుతోందని 'ఫ్యాన్స్‌' చెబుతున్నారు. ఇప్పుడామె షాహిద్‌ కపూర్‌ తమ్ముడు ఇషాన్‌ కట్టర్‌ తో కలిసి 'ధడక్‌' అనే మూవీలో నటిస్తోంది. డెబ్యూ మూవీ కావడంతో.. పెర్ఫామెన్స్‌ తో పాటు ఫిట్‌ నెస్‌ కూడా ముఖ్యమని భావిస్తోంది జాహ్నవి కపూర్‌. శశాంక్‌ ఖైతాన్‌ డైరెక్షన్లో కరణ్‌ జోహార్‌ నిర్మాతగా వస్తున్న 'ధడక్‌' మరాఠీ సూపర్‌ హిట్‌ 'సైరాట్‌' కి రీమేక్‌.

Comments