ఇక్కడ ప్రభాస్‌తో..అక్కడ వరుణ్‌తో రొమాన్స్‌

ఇక్కడ యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌తో అక్కడ యంగ్‌ హీరో వరుణ్‌ థావన్‌తో ఒకేసారి రొమాన్స్‌ చేస్తుంది శ్రద్ధాకపూర్‌. అందచందాలు ఆరబోతలో ఏ మాత్రం కాంప్రమైజ్‌ కానీ శ్రద్ధా సాహోలో భారీ పారితోషికం తీసుకుంది. బాహుబలితో అంతర్జాతీయ ఖ్యాతి అందుకున్న ప్రభాస్‌ ఇమేజ్‌ను కాపాడడమే శ్రద్ధ ముందున్న పెద్ద టాస్క్‌. కచ్చితంగా ప్రభాస్‌ సరసన బెస్ట్‌ కో స్టార్‌ అనిపించుకునేందుకు ఈ అమ్మడు ప్రత్యేక దృష్టి పెట్టింది. బాలీవుడ్‌లో ఉన్న నవతరం నాయికల్లో బెస్ట్‌ పెర్ఫామర్‌గా గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు. క్యూట్‌ అప్పియరెన్స్‌తో, హాట్‌ అప్పీల్‌తో డ్యూయల్‌ క్వాలిటీస్‌ ఉన్న ముద్దుగుమ్మగా .. మన డార్లింగ్‌ ప్రభాస్‌ మనసు దోచింది. అందుకే శ్రద్ధాని ఏరికోరి 'సా¬' కోసం ఒప్పించారు. టాలీవుడ్‌లోనే మోస్ట్‌ అవైటెడ్‌ మూవీగా 'సా¬' పేరు మార్మోగిపోతోంది. మరోవైపు బాలీవుడ్‌లోనూ అంతే క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది. అక్కడ యంగ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ సరసన నాయికగా నటిస్తోంది. క్రేజీ యంగ్‌ హీరో వరుణ్‌ధావన్‌ 'జుడ్వా 2'తో బ్లాక్‌బస్టర్‌ కొట్టాడు. జుడ్వా -2 ఈ హీరోని 100 కోట్ల క్లబ్‌లో నిలబెట్టింది. అదే హుషారులో ప్రస్తుతం అతడు వరుసగా మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. అక్టోబర్‌, సుయ్‌ ధాగ్‌ చిత్రాలతో పాటు 'నవాబ్‌జాదే' అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో శ్రద్ధా కపూర్‌ కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా పోస్టర్లను లాంచ్‌ చేశారు. శ్రద్ధా- ధావన్‌ కాంబినేషన్‌ అంటే 'ఎబిసిడి -2' గుర్తొస్తుంది. ఇప్పుడు మరోసారి ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ అదరిపోయిందన్న టాక్‌ వచ్చింది. టాలీవుడ్‌, బాలీవుడ్‌ రెండు చోట్లా క్రేజీ హీరోలతో అవకాశాలు అందుకుంది అమ్మడు. 2018 శ్రద్ధా కపూర్‌దేనంటే అతిశయోక్తి కాదు.

                                                                                                            -పక్కి.వేణుగోపాల్‌ 

Comments