ముంబైః కొత్త దంపతులు విరాట్ కోహ్లి, అనుష్క శర్మ సౌతాఫ్రికా ఫ్లెటెక్కారు. అయితే వాళ్లు వెళ్లేది హనీమూన్ కోసం కాదు. కఠినమైన సౌతాఫ్రికాతో సిరీస్‌కు విరాట్ కోహ్లి సిద్ధమవనుండగా.. అతనితో కలిసి అక్కడే న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోనున్న అనుష్క.. తర్వాత ఇండియా రానున్నది. ఈ ఇద్దరూ మిగతా టీమ్‌తో కలిసి బుధవారం అర్ధరాత్రి ముంబైలో సౌతాఫ్రికా ఫ్లెటెక్కారు. పదిహేను రోజులుగా కళ్లు చెదిరే కలర్‌ఫుల్ దుస్తుల్లో కనిపించిన ఈ ఇద్దరూ.. ఫ్లెటెక్కే ముందు సాధారణ ట్రాక్ సూట్‌లలో కనిపించారు. ఈ టూర్‌కు వెళ్లే ముందు కోచ్ రవిశాస్త్రితో కలిసి కోహ్లి విూడియాతో మాట్లాడిన విషయం తెలిసిందే. గతంలో చేయలేనిది ఇప్పుడు తాము చేయడానికి సిద్ధంగా ఉన్నామని, ఒకే రోజు రెండు మూడు ప్రాక్టీస్ సెషన్లతో అక్కడి వాతావరణానికి తాము త్వరగా అలవాటు పడతామని విరాట్ చెప్పాడు.

Comments
Post a Comment