ఓ బుంగమూతి లచ్చిమి...!

ఓయ్‌ రంగమ్మా మంగమ్మా ... 
ఓయ్‌ రంగమ్మా మంగమ్మా ... 

రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడూ 
పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడూ 
రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడూ 
పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడూ 

గొల్లభామ వచ్చీ ... నా గోరు గిల్లుతుంటే... 
గొల్లభామ వచ్చీ నా గోరు గిల్లుతుంటే... 
పుల్ల చీమ కుత్తి నా పెదవి సలుపుతుంటే 

ఉఫ్ఫమ్మా ఉఫ్ఫమ్మా అంటు ఊదడూ 
ఉత్తమాటకైన నన్ను ఊర్కోబెట్టడూ 
ఉఫ్ఫమ్మా ఉఫ్ఫమ్మా అంటు ఊదడూ 
ఉత్తమాటకైన నన్ను ఊర్కోబెట్టడూ 

అద్భుతం కదా..పాట అద్భుతం..రాసిన చంద్రబోస్‌ అద్భుతం..తన హావభావాలతో పాటకు ప్రాణం పెట్టిన సమంత ఓ అద్భుతం..హీరోయిన్‌ అంటే నాలుగు పాటలు..బొడ్డు కింద డ్రెస్‌..అందాల ఆరబోత. ఇంతేనా?? కాదు సమంతను చూడండి..బొడ్డు కింద కట్టిన పరికిణీ అందాన్ని చూసి గోదారమ్మ మురిసిపోయింది. ప్రేక్షక లోకం మైమరచిపోయింది. బుంగమూతితో ఎన్నెన్ని భావాలు పలికించిందో లచ్చిమి. ఓయబ్బో ఎన్నిన్ని వయ్యారాలో..ఎన్నెన్ని సరాగాలో...గోదావరి పరవళ్లులా పెర్ఫామెన్స్‌ అదరగొట్టేవే పిల్లా..ఉఫ్ఫమ్మా ఉఫ్ఫమ్మా అంటూ ఎంతది హృదయాలను ఊదేసావే పిల్లా..గోదారోళ్లను ఎంత తొందరగా పట్టేశావ్‌..ఆ యాస..బాస..నవరసాలు పిండేసావ్‌ లచ్చిమి...నీ అసాదారణ నటనతో గోదావరిలో దూకి చీర చెంగుతో చేపలా ఈదుతుంటే అది రంగస్థలం కాకపోతే మరి ఏంటి.? చరణ్‌ అద్భుతంగా చేశాడు..చిరంజీవికి నిజమైన వారసుడనిపించుకున్నాడు. నీకు ముందూ వెనుకా ఎవరూ లేరు. అందుకే పిల్లా నీకు నువ్వే స్టార్‌ అయిపోయావు. తెల్లకాగితంలా రండి..మంచి ఫీల్‌ కలుగుతుందని అన్నాడు సుక్కూ. ఎందుకలా అన్నాడో సినిమా చూసినోళ్లకు అర్థమయ్యే ఉంటుంది. సమంత కూడా తెల్లకాగితం లాంటి నటే. అందుకే పెర్ఫామెన్స్‌ పీక్స్‌లో ఉంది. లచ్చిమీ..హార్ట్‌ టచ్‌మీ.. 
                                                                                       - వేణు

Comments