పీకే ఫొటో షూట్‌

జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ సినిమాలకు గుడ్‌ బై చెప్పి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేశాడు. ఇక ఎన్నికలకు సంవత్సర కాలం కూడా లేకపోవడంతో పార్టీ బలోపేతానికి చేయవల్సిన కార్యక్రమాలను మెల్లగా మొదలెడుతున్నాడు. ఏ రాజకీయ నాయకుడికైనా ముందుగా బాగుండాల్సింది..ముఖంలో వెల్లివిరిసే కళ. కేవలం కట్‌ ఔట్స్‌ తోనే ప్రజలను తన దగ్గరకు రప్పించుకోవాలి, మనం మాట్లాడే ప్రతిమాట వాళ్ళ మనసుల్లో గుచ్చుకోవాలి. అందుకే పవన్‌ కూడా పొలిటికల్‌ ఫోటో షూట్‌ ను ఇవాళే జరుపుకున్నాడు. ఫోటోగ్రఫీ లో ఆరితేరిన వారితో ప్రజానాయకుడిగా, ప్రజల నాయకుడిగా తెల్లటి జబ్బాతో అదిరిపోయే హావభాలతో ఆ ఫోటో షూట్‌ జరిగినట్లు తెలుస్తోంది. మరి ఇప్పుడు చేసిన ఫోటో షూట్‌ ప్రజల్లో ఎలాంటి భావనను క్రియేట్‌ చేస్తుందో చూడాలి. ఇక పవన్‌ రాజకీయ విషయాలకొస్తే ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక ¬దా తప్పకుండా కావాలని కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి తనవద్ద అన్ని రకాల అస్త్రాలను వాడేస్తున్నాడు.

Comments