చిట్టిబాబు..రామలక్ష్మి అదుర్స్‌ కదూ..

రంగస్థలం..ఈ ప్రాజెక్టు లాంచ్‌ దగ్గర్నుండే ఎనలేని పాజిటిక్‌ వైబ్రేషన్స్‌ ను సొంతం చేసుకుని తెలుగు సినీలోకాన్ని వెయ్యి కళ్ళతో ఎదురుచూసేలా చేసిన సినిమా. సుకుమార్‌ దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ నటిస్తున్నాడంటే..వినడానికే ఇంత బాగుంటే..తెరపై ఇంకెంత బాగుంటుంది అనే టాక్‌ ను క్రియేట్‌ చేసి ఇంత దూరం వచ్చింది. ఫస్ట్‌ లుక్‌ వచ్చినప్పుడు..చిట్టిబాబు పాత్రలో చెర్రీ..అచ్చం పల్లెటూరి యువకుడిలా గడ్డం పెంచుకుని, రంగు రంగుల చొక్కాలతో సరికొత్త మేకోవర్‌ లో కనిపించి..అసలు ఇక్కడ చెర్రీ బాబేనా అని ముక్కున వేలేసుకునేలా చేసింది. 
ఇక టీజరైతే..సుకుమార్‌..ఎంతో ప్రీతీతో ప్రతి షాట్‌ ను తీశాడని అర్థమవుతోంది. ఆ పెల్లెటూరి వాతావరణాన్ని రి క్రియేట్‌ చేయడం అంటే మాములు విషయమా..!. చరణ్‌ కు కెరియర్‌ ఆరంభం నుండే మాస్‌ ఫాలోయింగ్‌ బలంగా ఉంది. అలాంటింది..చిట్టి బాబుకి సౌండ్‌ వినిపడదు..కనపడుద్ది అని ఛాలెంజింగ్‌ పాత్రలో నటింపజేయడం అంటే స్టోరీ బ్రిలియెన్స్‌ కదా!. సమంతను కూడా డీగ్లామర్‌ రోల్లో రామలక్ష్మీగా తయారుచేసి..పదహారేళ్ళ బాపు బొమ్మ మనకళ్ళ ముందు తిరుగుతోందా అని సందేహం కలిగేలా చేశాడు మన సుక్కు. ఇటు దేవి శ్రీ ప్రసాద్‌ కూడా స్టోరీకి సరిపోయేలా పర్ఫెక్ట్‌ ఫోక్‌ సాంగ్స్‌ తో మ్యాజిక్‌ చేస్తున్నాడు. అసలు ఈ మధ్య వచ్చే తెలుగు పాటల్లో వినసొంపైన సాహిత్యం ఎక్కడైనా ఉందా అని ప్రశ్న మాదిలేలోపే..చంద్రబోస్‌ తన కలంలో తెలుగుదనాన్ని ఒలకపోశాడు. ఇన్ని పాజిటివ్‌ అంశాలు, ఎన్నో గొప్ప విశేషాలు కలుపుని ఈ నెల 30న మా రంగస్థలంకు రమ్మంటున్నాడు మన చిట్టి బాబు. మరి అప్పటి వరకు ఆ ఊరి బస్సు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూడడమే మన పని.

Comments