'అంధ'మైన విజయం


చూపు లేకపోయినా 
స్టార్టప్‌ కంపెనీ స్థాపించింది శ్వేత మండల్‌ సక్సస్‌ స్టోరీ

శ్వేత మండల్‌ పుట్టుకతో అంధురాలు కాదు. అంధత్వం విజయానికి అడ్డుకాదని నిరూపించింది. బ్రెయిన్‌ ట్యూమర్‌ రావడంతో అప్పుడప్పుడు కళ్ల మంట వచ్చేది. శ్వేత పదో తరగతి చదివేటప్పుడు చూపు కోల్పోయింది. కుటుంబం, తోటి మిత్రుల సహకారంతో పదో తరగతి పరీక్షలకు హాజరయింది. చూపు పోయినా 72 శాతం మార్కులతో పాసైంది. ఇంటర్మీడియట్‌ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌లో 65 శాతం మార్కులతో తన సత్తా చాటింది. ఇందిరీగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ నుంచి సోషియాలజీ డిగ్రీ పూర్తి చేసింది. 
హ్యుమన్‌ రైట్స్‌ ప్రోగ్రామ్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించింది. 2013 సంవత్సరంలో రాంచీ యూనివర్సిటీలో 29వ స్నాతకోత్సవం సందర్భంగా అప్పటి జార్ఖండ్‌ గవర్నర్‌ ద్రౌపది ముర్ము చేతుల విూదుగా గోల్డ్‌ మెడల్‌ అందుకున్నది. 2014లో నేషనల్‌ ఎలిజబుల్‌ టెస్ట్‌లో ఎదురులేని విజయం సాధించి ప్రభుత్వ కళాశాలల్లో లెక్చరర్‌గా పనిచేసే ఛాన్స్‌ కొట్టేసింది. ఒక అంధురాలు హ్యుమన్‌ రైట్స్‌లో ఎవరి సహకారం లేకుండా, అంధుల లిపి బ్రెయిలీ లేకుండా చదవడమంటే మామూలు విషయం కాదు. రికార్డెడ్‌ మెటీరియల్‌తో ఏ పుస్తక సహాయం లేకుండా సాధించిన విజయం. టెక్ట్స్‌ టు స్పీచ్‌ కన్‌వర్టెడ్‌ సాఫ్ట్‌వేర్‌ సహకారంతో సిలబస్‌ను చదివేసింది. ప్రస్తుతం శ్వేత జవహార్‌ లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ నుంచి సోషియాలజీలో ఎంఫిల్‌ చదువుతున్నది. ప్రస్తుతం ఓ స్టార్టప్‌ కంపెనీ స్థాపించి ఆ రంగంలో దూసుకుపోతోంది.

Comments