ఇది పెళ్లి'గే'ల

ఆడ..ఆడ-మగ..మగ పెళ్లిళ్లు 
ఆడ, మగ పెళ్లి చేసుకోవడం మామూలే. కానీ ఆడ-ఆడ, మగ - మగ పెళ్లిళ్లు చేసుకోవడం విడ్డూరంగా ఉన్నా ఇప్పుడది చట్టబద్ధం. అందుకే వారు కూడా వివాహబంధంతో ఒక్కటవుతున్నారు. ఆ మధ్య ఇండో అమెరికన్లు, మలయాళీ గేలు పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పటిదాకా కలిసుండడం మాత్రమే చేసే చాలామంది ఏడడుగులు, అగ్ని సాక్షిగా ఒక్కటవ్వాలనుకుంటున్నారు. అందుకేనేమో ఒక ఎన్‌ఆర్‌ఐకి గే మ్యారేజ్‌ బ్యూరో పెట్టాలనే ఆలోచన వచ్చింది. దీనికి కారణం కూడా లేకపోలేదట.. బెన్‌హుర్‌ సామ్‌సన్‌ అనే అతను గేలకు సరోగసీ చేయడానికి సహాయపడ్డాడు. అది తెలుసుకున్న ఓ ఎన్‌ఆర్‌ఐ ఇలా ¬మోసెక్సువల్‌ని ఒక్కటి చేయాలనుకున్నాడు. ఇంటర్నేషనల్‌ అరెంజ్డ్‌ గే మ్యార్‌ బ్యూరోపేరుతో బ్యూరో మొదలుపెట్టాడు. ఈ బ్యూరోలో ఎన్‌రోల్‌ చేసుకున్న వాళ్ల దగ్గరకు లాయర్లను కూడా పంపిస్తారట. లీగల్‌గా ఎలాంటి సమస్యలు లేవనుకున్న తర్వాతనే వారి పేరు నమోదు కార్యక్రమాలు ఉంటాయట. వీరికి 33వేల రూపాయలు ఛార్జ్‌ చేస్తారు. ఇప్పటిదాకా ఈ వెబ్‌సైట్‌ని రెండు లక్షల మందికి పైగా చూశారు. ఐదు వేలకు మంది ఎన్‌రోల్‌ కూడా చేసుకున్నారట. అన్నీ వింతపోకడలనిపిస్తోంది కదా! ఏం చేస్తాం కలికాలం..

Comments