బోసిపోయిన థియేటర్లు

హైదరాబాద్‌: తెలంగాణ, ఏపీలోగల సినిమా థియేటర్లు మూతబడ్డాయి. డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు... భారంగా మారిన వర్చువల్‌ ప్రింట్‌ ఫీజు (వీపీఎఫ్‌) తగ్గించకపోవడాన్ని నిరసిస్తూ మార్చి 2 నుంచి థియేటర్లను మూసివేయాలని దక్షిణాది రాష్ట్రాల సినిమా నిర్మాతల మండలి జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (జేఏసీ) నిర్ణయించింది. దీంతో హైదరాబాద్‌ నగరంలోని ఆయా ప్రాంతాల్లోగల సినిమా థియేటర్లను మూసివేశారు. ఒక్క నగరంలోనేగాక విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ ఇతర ప్రముఖ కేంద్రాల్లో థియేటర్లు మూసివేశారు. ఇప్పటకే భారంగా మారిన వీపీఎఫ్‌ను తగ్గిస్తేగానీ సినిమాలు ప్రదర్శించబోమని సినీ వర్గాలు చెబుతున్నాయి.

Comments