'సంపూర్ణ రామాయణం-3డి

రామాయణం తెరకెక్కిస్తున్నానని అగ్రనిర్మాత అల్లు అరవింద్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. 'బాహుబలి' సిరీస్‌ సక్సెస్‌ అనంతరం తాను ఈ ఛాలెంజ్‌ను తీసు కున్నారని అందరికీ అర్థమైంది. అనంతరం దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో 'రామాయణం' చిత్రాన్ని బహుబాషల్లో తెరకెక్కించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఆ క్రమంలోనే ఇటీవలే ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వంతో ఓ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. భాగస్వాములు నమిత్‌ మల్హోత్రా, మధు మంతెనతో కలిసి ఓ ఎంవోయూపై సంతకం చేయడం అప్పట్లో చర్చకొచ్చింది. 
లేటెస్టుగా ఈ క్రేజీ ప్రాజెక్టునకు సంబంధించి అదిరిపోయే అప్‌డేట్‌ అందింది. ఇప్పటికే ఈ సినిమా టైటిల్‌ని తెలుగు ఫిలింఛాంబర్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించారు. 'సంపూర్ణ రామాయణం' అన్న టైటిల్‌ని రిజిష్టర్‌ చేయించడంతో ఇక ప్రాజెక్ట్‌ అధికారికంగా లాంఛనమేనని అర్థమైంది. తెలుగు, హిందీ, తమిళ్‌, మలయాళ, కన్నడలో 500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించే ఈ సినిమా కోసం అన్ని భాషల నుంచి టాప్‌ కాస్టింగును ఎంపిక చేయనున్నారు. ఇక ఈ సినిమాని 'పద్మావత్‌ 3డి' తరహాలో పూర్తిగా 3డిలో తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. 'పద్మావత్‌ 3డి' సక్సెస్‌ అనంతరం 3డి సినిమాల వెల్లువ మరింత పెరిగింది. తదుపరి భారీ 3డి చిత్రాలు 2.ఓ, థగ్స్‌ ఆఫ్‌ హిందూస్తాన్‌ రిలీజ్‌కి రానున్నాయి. ఆ క్రమంలోనే అల్లు అరవింద్‌ నిర్మించే 'సంపూర్ణ రామాయణం -3డి', అమీర్‌ఖాన్‌ 'మహాభారతం 3డి' క్యూలోకొస్తున్నాయన్నమాట!

Comments