రా..నీ అంతు చూస్తా. నా ఆవులపై దాడి చేస్తావా? నీకెంత ధైర్యం. చిరుత అంటే అందరికీ భయమేమో..కానీ నాకు కాదు. తాట తీస్తా..సింహం గెడ్డం గీసుకోదు..నేను గీసుకుంటా అంతే ..మిగతాదంతా సేమ్ టు సేమ్ అంటూ ఓ 62 ఏళ్ల వృద్ధుడు పులికి సవాల్ చేశాడు. మంచి ఆకలిమీద ఉన్న చిరుత రెచ్చిపోయింది. తన పంజాతో ఎదురుదాడికి దిగింది. మనోడు తక్కువేం కాదు తన దగ్గరున్న చిన్న కత్తితో చిరుతని హతమార్చాడు. ఇదేదో పాత సినిమాలో సీన్‌లా అనుకుంటే అది మా తప్పుకాదు. ఆ వృద్ధుడు పేరు కృష్ణమూర్తి. చిత్తూరు జిల్లా ఆంధ్రా-తమిళనాడు సరిహద్దులోని కృష్ణ గిరి వద్ద మహారాజ కడై గ్రామంలో ఉంటున్నాడు. తాను పెంచుకుంటున్న ఆవులను పులి చంపేస్తోంది. దీని చూసి తట్టుకోలేకపోయిన కృష్ణమూర్తి పులిని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ప్రాణాలకు తెగించి మరీ నిర్ణయం తీసుకున్నాడు. ఆవులకు కాపలా ఉంటున్న కృష్ణమూర్తి ఏ మాత్రం భయపడకుండా చిరుతపై దాడి చేశాడు. ఆ సమయంలో తన వద్ద ఉన్న మచ్చు కత్తితో చిరుతను నరికాడు. ఈ ఘటనలో కృష్ణమూర్తికి స్వల్ప గాయాలు కాగా, చిరుత చనిపోయింది. ఇక చితరుపై దాడి విషయం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ కృష్ణమూర్తిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి, చిరుత మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఘటనపై విచారణ చేపట్టారు. ప్రస్తుతం స్వల్ప గాయాలతో కృష్ణమూర్తి చికిత్స పొందుతున్నాడు. ఏదైమైనా.. 62 ఏళ్ల వయసులో చిరుతతో పోరాడి.. కృష్ణమూర్తి తన ప్రాణాలను కాపాడుకున్నాడు..

Comments
Post a Comment