ఎన్నో అనుమానాలు.. మరెన్నో సందేహాలు


శ్రీదేవి శరీరం ఇండియాకు ఈ రోజూ డౌటే? 
ఇంకా శవాల గదిలోనే సిరమల్లెపువ్వు 
బోనీపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న దుబాయ్‌ పోలీసులు 


అందాల తార దివికేగి నాలుగు రోజులు అవుతోంది. ఆ సిరమల్లెపువ్వు శవాల గదిలో నిద్రపోతోంది. అందాల నగరంలో కన్నుమూసిన అతిలోక సుందరి కోసం భావతావని వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. అయితే ఆమె రాక ఇంకా ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీదేవి మరణంలో గంటకొక సందేహాలు వైరల్‌ అవుతున్నాయి. వాస్తవం ఎవరికీ తెలియదు. కానీ ఎక్కడో ఏదో జరిగిందన్న విషయం మాత్రం బలంగానే నమ్మాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ముందుగా హార్ట ఎటాక్‌ అన్నారు. ఆ తరువాత కార్డియాక్‌ అరెస్ట్‌ అన్నారు. ఇప్పుడు బాత్‌ టబ్‌లో పడి మృతి చెందిందని అంటూ దుబాయ్‌ వైద్యులు ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌ ఇచ్చారు. అయితే ఈ నివేదికపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాత్‌ టబ్‌లో శ్రీదేవి ప్రమాదవశాత్తు మునిగిపోయిందా...లేదంటే ఎవరైనా ముంచేశారా? 
ప్రమాదవశాత్తూ బాత్‌టబ్‌లో పడి చనిపోయిందని రిపోర్ట్‌, ఫోరెన్సిక్‌ నివేదికపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కేసును పునర్విచారణ చేస్తున్నట్టు ప్రకటించిన పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటికే భర్త బోనీ కపూర్‌ ప్రశ్నించిన పోలీసుల అధికారులు..దేశం విడిచి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఆయన పాస్‌పోర్టు కూడా స్వాధీనం చేసుకున్నారు. మరోసారి తమ కస్టడీలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే శ్రీదేవి, బోనికపూర్‌ కాల్‌ డేటాపై దృష్టి పెట్టారు. శనివారం డిన్నర్‌కు రెడీ అవడానికి బాత్‌ రూంకి వెళ్లిన శ్రీదేవి బాత్‌ రూమ్‌లో జారిపడిపోయింది. కాలు జారి పక్కనే ఉన్న బాత్‌ టబ్‌ లో పడిపోయారు. ఆమె బాత్‌ టబ్‌ లో మునిగి పోవడం వల్లే మరణించిందని దుబాయ్‌ ఆరోగ్య శాఖ నివేదిక తెలిపింది. అయితే అనేక అనుమానాలు ఈ రిపోర్ట్‌పై వ్యక్తమవుతున్నాయి అనే ప్రశ్నలు వెంటాడుతున్నాయి. హడావుడిగా దుబాయ్‌ వైద్యులు ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌ ఇచ్చారా? ప్రమాదవశాత్తూ అని తేల్చడమేంటి? 
ాడావుడిగా దుబాయ్‌ వైద్యులు ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌ ఇచ్చారా? ప్రమాదవశాత్తు అని అప్పుడే తేల్చడమేంటి? ఇచ్చిన రిపోర్టులో కూడా స్పెల్లింగ్‌ మిస్టేక్‌ ఉండడంతో అనుమానాలు రేగుతున్నాయి. ఘటన జరిగిన సమయంలో రూంలో ఎవరున్నారు? భర్త బోనీ కపూర్‌ ¬టల్‌లోనే ఉన్నాడా...ముంబైలోనా? బాత్రూమ్‌లో శ్రీదేవి భౌతిక కాయాన్ని మొదట గుర్తించిందెవరు? ఇంతవరకూ కుటుంబ సభ్యులు ఎందుకు నోరువిప్పలేదు? మత్తులో శ్రీదేవి తనంతటా తానే బాత్‌ టబ్‌లో పడిపోయారా? లేదంటే ఎవరైనా ఆమెను తోసేశారా? కేవలం టబ్‌లో పడిపోతే చనిపోతారా? మొదట గుండెపోటు అని బంధువులు ఎందుకు చెప్పారు? మృతికి కారణాలపై అబద్దాలు చెప్పాల్సిన అవసరం ఏంటి? 
ఇలా ఎన్నో ప్రశ్నలు ఉదయిస్తున్నాయి..అంతేకాదు, ఈసాయంత్రానికి ముంబైకి మృతదేహాన్ని తరలిస్తారని అనుకుంటే, మరింత ఆలస్యం చేస్తున్నారు. ఎందుకంటే, శ్రీదేవి మరణంపై అనుమానాలు పెరగడమే కారణం. మొదట గుండెపోటు అని వార్తలు రావడం, తర్వాత ప్రమాదవశాత్తు టబ్‌లో మునిగిచనిపోయిందని చెప్పడంతో సందేహాలు వ్యక్తమయ్యాయి. దీంతో కేసును పునర్విచారణ చేస్తున్నట్టు ప్రకటించారు దుబాయ్‌ పోలీసులు. ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌పై ఫ్యామిలీ ఫ్రెండ్‌, అమర్‌ సింగ్‌ కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, ఈ కేసులో కీలకమైన వ్యక్తి భర్త బోనీకపూర్‌. ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌ చేతికందిన తర్వాత, దాదాపు మూడు గంటలపాటు కపూర్‌ను ప్రశ్నించారు పోలీసులు. ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. శ్రీదేవితో పాటు బోనీకపూర్‌ కాల్‌డేటాను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. మరో ముగ్గుర్ని కూడా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. 
శ్రీదేవి భౌతికకాయం అప్పగింతపై సస్పెన్స్‌? 
వెండి తెరను ఏలిన మహారాణి ఆమె. అభిమానుల గుండెల్లో సుస్థిరస్థానం ఏర్పర్చుకున్న నటీమణ, భారతీయ సినీ పరిశ్రమలో రారాణిగా వెలుగొందిన శ్రీదేవి ప్రస్తుతం ఏడారి దేశంలో విగతజీవిగా పడిఉంది? కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, కోట్లాదిమంది శ్రేయోభిలాషులున్నా? కనీసం ఏ ఒక్కరు కూడా ఆమె పక్కనలేని దుస్థితి. ఇక మరోవైపు దుబాయ్‌లో మృతిచెందిన శ్రీదేవి భౌతికకాయం అప్పగింతపై సస్పెన్స్‌ కొనసాగుతోంది? ఇవాళ కూడా ఆమె మృతదేహం ఇండియా రావడం అనుమానంగానే కనిపిస్తోంది. 
ఆస్తి గొడవలున్నాయా? 
అవుననే అంటోంది బాలీవుడ్‌ . బోనీకపూర్‌, శ్రీదేవి..బోనికపూర్‌ మొదటి భార్య బంధువుల మధ్య మనస్పర్థలున్నాయి. దుబాయ్‌లో జరిగిన పెళ్లి వేడుకలో కూడా శ్రీదేవిని అవమానించినట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కలత చెందిన శ్రీదేవి హొటల్‌కు వెళ్లిపోయారని, హోటల్‌ నుంచి బయటకు రాకపోవడంతోనే బోనికపూర్‌కు సిబ్బంది ఫోన్‌ చేశారని ఓ వార్త వైరల్‌ అవుతోంది. పెళ్లికి బోనీకపూర్‌, శ్రీదేవి, ఖుషి వెళితే..బోనికపూర్‌ ముంబై వచ్చేయడానికి కారణం ఏంటి? శ్రీదేవి దుబాయ్‌లో జాన్వీ కోసం షాపింగ్‌ చేయడానికి ఉండిపోయిందని చెబుతున్నారు. అయితే శ్రీదేవికి సరప్రైజ్‌ డిన్నర్‌ ఇచ్చేందుకు బోనీకపూర్‌ మళ్లీ దుబాయ్‌ రావడం? కొద్దిసేపు ఇద్దరూ మాట్లాడుకోవడం..ఆ తరువాత బాత్రూమ్‌లో పడిపోవడం జరిగాయని మీడియా కథనాలు వండివార్చుతున్నాయి. బోనికపూర్‌ వ్యవహారంలో ఎక్కడో లింక్‌ తప్పుతున్నట్టు..దుబాయ్‌ ప్రాసిక్యూషన్‌ అనుమానం వ్యక్తం చేస్తోంది. శ్రీదేవిపై సుమారు వంద కోట్లకుపైగా ఇన్సూరెన్స్‌ ఉంది. ఆస్తి తగదాలు కారణంగా ఎవైనా గొడవలు జరిగాయా? ఒకే నంబర్‌ నుంచి శ్రీదేవి ఎక్కువ కాల్స్‌ చేసిందెవరు? వంటి అంశాలను ప్రాసిక్యూషల్‌ లోతుగా దర్యాప్తు ప్రారంభించింది. అప్పటి వరకూ శ్రీదేవి అందమైన శరీరాన్ని బంధువులకు అప్పగించే అవకాశం లేదు. దీంతో బుధవారం సాయంత్రానికి కూడా శ్రీదేవి శరీరం ఇండియాకు వచ్చే అవకాశం లేదు.

Comments