ఈ ఫొటోలో ఉన్నది భూమిక శర్మ..సిక్స్ ప్యాక్ బాడీ..కండలు తిరిగిన శరీరం. షూటర్ అవుతానని వెళ్లిన యువత ఇలా బాడీబిల్డర్‌గా ఇంటికి వచ్చింది. తనతో పాటు ప్రపంచ బాడీబిల్డింగ్ కప్‌ను కూడా వెంట తెచ్చింది. ఇంకేముంది కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆశ్చర్యంలో మునిగిపోవడం వారి వంతైంది
భూమిక శర్మ.. డెహ్రడూన్‌కు చెందిన 21 ఏళ్ల బాడీబిల్డర్. గతవారం వెనిస్‌లో జరిగిన ప్రపంచ మహిళల బాడీబిల్డింగ్ విజేత. చిన్నప్పటి నుంచి షూటర్ అవుతానని కలలు కన్న భూమికను తల్లిదండ్రులు బాగా ప్రోత్సహించారు. మూడేళ్ల క్రితం ఢిల్లీలో జరిగిన ఓ షూటింగ్ పోటీల్లో బాడీబిల్డింగ్ కోచ్‌తో కాసేపు ముచ్చటించింది. ఇక అంతే షూటింగ్ గన్ను వదిలేసి.. జిమ్‌లో డంబెల్స్ పట్టింది. రేయింబవళ్లు కష్టపడి కండలు పెంచింది. మొదట తల్లిదండ్రులు ఒప్పుకోక పోయిన్పటికీ.. ఒక్కతే కూతురు కావడంతో తన ఇష్టాన్ని కాదనలేక మెల్లిగా అలవాటు చేసుకున్నారు. జిమ్‌లో ఎంతో కష్టపడిన భూమికకు.. పతకాన్ని గెలుచు కోవడానికి ఎంతో సమయం పట్టలేదు. వెనిస్‌లో ఇటీవల జరిగిన ప్రపంచ మహిళల బాడీబిల్డింగ్ పోటీల్లో 50 మంది పోటీదారులను వెనక్కునెట్టి.. మూడు విభాగాల్లో గరిష్ఠ పాయింట్లు సాధించి.. మిస్‌వరల్డ్ టైటిల్ విజేతగా నిలిచింది. ప్రస్తుతం ఈ ఏడాది డిసెంబర్‌లో జరుగనున్న మిస్ యూనివర్స్ సిద్ధపడుతున్నది భూమిక. మనదేశం నుంచి మిస్ వరల్డ్ గెలవాలని ఆకాంక్షిస్తున్న భూమికకు మనమూ ఆల్ ది బెస్ట్ చెబుదాం.

Comments
Post a Comment