సోఫియా...ఫిదా చేసింది

ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌ సదస్సు రెండో రోజుకు చేరుకుంది. ఈ సదస్సులో హ్యూమనాయిడ్‌ రోబో సోఫియా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రపంచంలోనే ఓ దేశ పౌరసత్వం ఉన్న ఏకైక రోబో సోఫియా. ఇక రోబోని మొదటి ప్రశ్నగా ఇండియా గురుంచి, ఇక్కడి ప్రజల గురించి నీ అభిప్రాయం ఏంటి అని అడిగారు. దానికి చక్కటి సమాధానం ఇచ్చింది సోఫియా. 'మానవత్వంతోనే మెరుగైన భవిష్యత్తు' అనే అంశంపై ఈ ఆడ రోబో ప్రత్యేక ప్రసంగం చేయనుంది. ఇక రెండో రోజు సదస్సులో కృత్రిమ మేథస్సు, నూతన టెక్నాలజీపై చర్చించనున్నారు. ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌ సదస్సు నాస్కామ్‌, విట్సా, తెలంగాణ ప్రభుత్వంలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సదస్సును నిన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా ప్రారంభించారు. ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌ సదస్సులో కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తో సహా వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు.

Comments