ఆ కళ్లు..మైమరపిస్తున్నాయి
ఆ కళ్లు..మత్తెక్కిస్తున్నాయి
ఆ కళ్లు..ఎన్నో వేరియేషన్స్ పలికిస్తున్నాయి
ఆ కళ్లు..అచ్చ తెనుగు పదహారణాల పడుచు అందాలను ప్రతిబింబిస్తున్నాయి
ఆ కళ్లు..యువకులను కలవరపెడుతున్నాయి..
ఆ కళ్లు...అందాల తార ఐశ్వర్యవి కావు..
ఆ కళ్లు..భాగమతి స్వీటి అనుష్కవూ కావు
ఆ కళ్లు..అసలు అమ్మాయివే కావు
ఆ కళ్లు..మరి ఎవరివి?
ఆ కళ్లు ..కరిష్మా పాత్రలో మెప్పించేందుకు మలయాళ నటుడు ఉన్ని ముకుందన్. మలయాళ నటుడు. మొదట జనతా గ్యారేజ్.. ఆ తరువాత భాగమతి. అతను నటించిన ఈ రెండు సినిమాలూ హిట్ కొట్టాయి. ప్రస్తుతం ఉన్ని నటిస్తోన్న తాజా మలయాళ చిత్రం చాణక్యతంత్రం. ఈ చిత్రంలో ఉన్ని.. యువతి పాత్రలో నటిస్తున్నాడు. ఆ పాత్ర పేరు కరిష్మా. అనూష్కను మరిపించేంత అందంగా తయారయ్యాడు ఉన్ని. మేకప్ వేస్తుండగా.. తీసిన వీడియోను చిత్రం యూనిట్ సోషల్ విూడియాలో పోస్ట్ చేసింది. కరిష్మా పాత్రలో పరకాయ ప్రవేశం చేయడానికి ఉన్ని ఎంత కష్టపడ్డారో ఈ వీడియో స్పష్టం చేస్తోంది. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ 'నా భాగస్వామి కరిష్మా. ఈ ప్రయాణం చాలా అందం, నొప్పితో కూడుకున్నది. ఈ కష్టానికి ఫలితం దక్కుతుందని ఆశిస్తున్నా' అని కామెంట్స్ చేశారు.



Comments
Post a Comment