సోఫియా స్వీచ్ ఓ హౖెెలెట్..దీపికా ఫినిషింగ్ టచ్ అదుర్స్. ఐటీ ఆవిష్కరణలు, డిజిటల్ డీల్స్ మధ్య హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరుగుతున్న ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సు విజయవంతంగా ముగిసింది. ఐటీ కాంగ్రెస్ సదస్సులో 'మానసిక దృఢత్వం' అంశంపై నిర్వహించిన ప్రత్యేక చర్చలో దీపికా పదుకునే మాట్లాడుతూ? ఒంటరిననే భావన మానసిక కుంగుబాటు(డిప్రెషన్)కు దారితీస్తుందని, ఎలాంటి పరిస్థితులలో దానిని దరిచేరనీయవద్దని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మానసిక కుంగుబాటు అంటువ్యాధిలా మారుతోందని తెలిపారు. ఈ మానసిక కుంగుబాటు ప్రతి ఐదుగురిలో ఒకరు అనుభవిస్తున్నారు అని చెప్పారు. సామాజిక చైతన్యమే కుంగుబాటుకు సరైన పరిష్కారమన్నారు. 2014లో కుంగుబాటుకు, మనోవేదనకు స్వయంగా గురయ్యా. ఆ సమయంలో ఒంటరితనంతో నాలో నేనే కుమిలిపోయా, ఒక్కోసారి ఆ బాధను తట్టుకోలేక ఏడ్చేదాన్ని. ఆ సమయంలో మా అమ్మ నాకు అండగా నిలిచింది. మానసిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇప్పించి, ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు అని అన్నారు దీపికా. మానసిక ఆవేదన, వ్యధను ఇతరులతో పంచుకుంటేనే ఆ బాధ నుంచి బయటపడగలుగుతాం అని తెలిపారు. తన అనుభవాల నేపథ్యంలో మానసిక ఆరోగ్యంపై ప్రజల్లో చైతన్యం కలిగించడానికి 'ది లైవ్ లవ్ లాఫ్' అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు దీపికా.

Comments
Post a Comment