పాస్‌పోర్టు యాప్‌ విడుదల

లక్నో: పాస్‌పోర్టు దరఖాస్తుదారులకు శుభవార్త. పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసిన వారి పోలీసు వెరిఫికేషన్‌కు పాస్‌పోర్టు యాప్‌ను కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ కొత్తగా విడుదల చేసింది.పాస్‌పోర్టు పోలీసు వెరిఫికేషన్‌ ప్రక్రియను సులభతరం చేసేందుకు వీలుగా పాస్‌పోర్టు యాప్‌ విడుదల చేస్తున్నట్లు లక్నో ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి పీయూష్‌ వర్మ వెల్లడించారు. ఈ యాప్‌ సాయంతో పోలీసులు వెరిఫికేషన్‌ ను స్మార్ట్‌ ఫోన్‌ లేదా ట్యాబ్‌ ద్వారా దరఖాస్తుదారుని ఫోటో, డిజిటల్‌ సంతకాన్ని తీసుకుంటారని పీయూష్‌ వర్మ పేర్కొన్నారు.ఈ యాప్‌ సాయంతో పాస్‌పోర్టు పోలీసు వెరిఫికేషన్‌ ప్రక్రియను 20 రోజుల నుంచి నాలుగురోజుల సమయానికి తగ్గించవచ్చని పాస్‌పోర్టు అధికారులు వివరించారు.

Comments