ఇదో ఇంట్రస్టింగ్ వార్త. రాజమౌళి..ఎన్టీఆర్..రాంచరణ్ కాంబినేషన్‌లో విజయేంద్ర ప్రసాద్ అద్భుత కథతో తెరకెక్కనున్న మల్టీస్టారర్ చిత్రంలో ఇప్పుడు మరో హీరో వచ్చి చేరాడు. ఫుల్ ఎనర్జటిక్ హీరో..మాస్ మహారాజా ఈ మల్టీస్టారర్‌లో చేరనున్నట్టు ఓ వార్త హల్ చల్ చేస్తోంది. టాలీవుడ్‌లో మల్టీస్టారర్ చిత్రాల జోరు మెల్లమెల్లగా పెరుగుతోంది. త్వరలో నాగార్జున, నానిల కాంబినేషన్‌లో ఒక చిత్రం పట్టాలెక్కబోతున్న విషయం తెల్సిందే. ఇక రాజమౌళి దర్శకత్వంలో ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న మెగా, నందమూరి మల్టీస్టారర్ ప్రారంభం కానుంది. ఇలా వరుసగా మల్టీస్టారర్ చిత్రాలు తెరకెక్కుతున్న నేపథ్యంలో ఇతర హీరోలు కూడా మల్టీస్టారర్ చిత్రాలపై ఆసక్తిని కనబర్చుతున్నారు. రాజమౌళికి రవితేజకు మంచి స్నేహం ఉన్న నేపథ్యంలో ఇది నిజమే అయ్యుంటుందని కూడా అనుకున్నారు. ఐతే ఆ ఊహాగానాలపై మాస్ రాజా నీళ్లు చల్లేశాడు. 'టచ్ చేసి చూడు' ప్రమోషన్లలో భాగంగా ట్విట్టర్లో అభిమానులతో చిట్ చాట్ చేసిన మాస్ రాజా.. రాజమౌళి సినిమాలో విలన్ పాత్ర చేస్తున్నారటగా అని అడిగితే.. ఏదేదో ఊహించుకోవద్దు అంటూ సెలవిచ్చాడు. కానీ దాంతో పాటుగా ''ఈ ఐడియా బాగుంది'' అంటూ కామెంట్ చేయడం విశేషం. రవితేజ మాట్లాడుతూ.. తనకు ఇండస్ట్రీలో ఉన్న వారు అంతా కూడా స్నేహితులే అని, మంచి కథతో వస్తే ఏ హీరోతో నటించేందుకు అయినా సిద్ధంగా ఉన్నాను అని, పాత్ర మంచిగా ఉండి తనకు నచ్చితే నిడివి తక్కువ ఉన్నా పర్వాలేదు అని, ఏ హీరోతో అయినా స్క్రీన్‌ను షేర్ చేసుకుందానికి అయినా సిద్ధంగా ఉన్నాను అంటూ రవితేజ చెప్పుకొచ్చాడు. మొత్తానికి రవితేజ ఇచ్చిన ఆఫర్‌ను ఏ దర్శకుడు అయినా యూజ్ చేసుకుంటాడా అనేది చూడాలి. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 'నేలటికెట్', శ్రీనువైట్ల దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు కూడా ఇదే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాయి.

Comments
Post a Comment