అవినీతి భారతం

ఇండియాలో అవినీతికి అంతం లేకుండా పోతోంది. పారదర్శకతకు పెద్దపీట వేసేలా చర్యలు తీసుకున్నందుకు దేశంలో అవినీతి తగ్గుముఖం పట్టిందని ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు చెబుతున్న మాటలోల ఏ మాత్రం వాస్తవం లేదని తేలిపోయింది. బెర్లిన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ అనే సంస్థ తాజాగా విడుదల చేసిన అవినీతి దేశాల జాబితాలో మన దేశంలో జరుగుతున్న అవినీతిలో ఎలాంటి చెప్పుకోదగ్గ మార్పు లేదని స్పష్టం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 181 దేశాల్లో పరిస్థితులను విశ్లేషించిన ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్‌నేషనల్‌ సంస్థ.. భారత్‌ మొత్తం 40 పాయింట్ల జాబితాలో 81వ స్థానంలో నిలిచినట్టుగా పేర్కొంది. 
2016లో విడుదల చేసిన జాబితాలోనూ భారత్‌ 40 పాయింట్లతో 79వ స్థానంలో ఉన్నట్టుగా తెలిపిన 'ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్‌నేషనల్‌'? గతంలో 176 దేశాలపై మాత్రమే తాము అధ్యయనం చేశామని ఇప్పుడు దేశాల సంఖ్య పెరిగిందని వెల్లడించింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో అవినీతి జోరును ఈ సంస్థ పరిశీలించింది. 2015 నాటి అవినీతి దేశాల పరిస్థితుల అధ్యయనంలో మన దేశానికి 38 పాయింట్లతో మేటి ర్యాంకింగ్‌ లభించడం విశేషం. అవినీతి చాలా తక్కువగా ఉన్న దేశాల్లో న్యూజిలాండ్‌, డెన్మార్క్‌లు వరుసగా 89, 88 పాయింట్ల స్కోరింగ్‌తో ఉత్తమ దేశాలుగా నిలిచాయి. మరోవైపు సిరియా 14, దక్షిన సూడాన్‌ 12, సొమాలియా 09 దేశాలు వరుసగా జాబితాలో కింది స్థానాల్లో నిలిచాయి. కాగా మన పొరుగున్న ఉన్న చైనాలో భారత్‌ కంటే మెరుగైన పరిస్థితులు ఉన్నాయని? జాబితాలో ఆ దేశంలో 41 పాయింట్లతో 77వ స్థానంలో నిలిచింది. మరోవైపు దాయాది దేశం పాక్‌లో 32 పాయింట్ల స్కోర్‌తో 117వ స్థానంలో నిలిచినట్టుగా ఆ సంస్థ ప్రకటించింది. మరోవైపు అవినీతిపై పోరాడిన నేరానికి స్వచ్ఛంద సంస్థలపై, మీడియాపై ఈ మధ్య కాలంలో దాడులు తీవ్ర మయ్యాయని ఆందోళన వ్యక్తం చేసింది.

Comments