జయేంద్ర సరస్వతి శివైక్యం

కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి కన్నుమూశారు. నిన్న అనారోగ్యంతో కాంచీపురంలోని ఏబీసీడీ ఆస్పత్రిలో చేరిన కంచి పీఠాధిపతి బుధవారం ఉదయం శివైక్యం చెందారు. 82 ఏళ్ల జయేంద్ర సరస్వతి గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. పలుమార్లు ఆస్పత్రికి వెళ్లినా పూర్తిగా కోలుకోలేదాయన. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన జయేంద్ర సర్వతి గుండెపోటుతో మృతిచెందినట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 1935 జులైన 18న తంజావూరులో జన్మించిన ఆయన అసలు పేరు సుబ్రహణ్య అయ్యర్‌.1954 నుంచి కంచి పీఠాధిపతిగా సేవలు అందిస్తున్న ఆయన? పీఠాధిపతిగా సుదీర్ఘ కాలం ఎన్నో సేవలు అందించారు. కోట్లాది మంది భక్తులను సంపాదించుకున్నారు. గత కొంత కాలంగా శ్వాససంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన? ఎక్కువ కాలంగా ఆస్పత్రిలో ఉండడానికి ఇష్టపడలేదని? పీఠంలోనే ఉండాలని భావించారని చెబుతున్నారు శిష్యులు. ఈ వార్త వినగానే పెద్ద ఎత్తున శిష్యులు, స్థానిక ప్రజలను ఆస్పత్రి దగ్గరకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

Comments