అక్కినేని చిన్నోడు..హలో హీరో నటించే మూడో సినిమాకు పచ్చ జెండా పడింది. అన్ని కథలు విన్న చివరకు కొరటాల చెప్పిన కథకే అఖిల్ ఫిదా అయ్యాడు. వాస్తవానికి త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల ఇద్దరిలో ఎవరు దర్శకత్వం వహిస్తారు? అన్నదానిపై ఇంతవరకూ తర్జనభర్జన సాగింది. అయితే ఎన్టీఆరతో త్రివిక్రమ్ సినిమా ఒప్పుకోవడంతో కొరటాల శివను ఓకే చేసినట్టు తెలుస్తోంది. నాగార్జునే స్వయంగా ఈ బాధ్యతను కొరటాలకు అప్పగించారని ఫిల్మ్‌నగర్ మాట. కొరటాల ప్రస్తుతం మహేష్ తో 'భరత్ అనే నేను' చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఏప్రిల్‌లో రిలీజ్‌కి రెడీ అవుతోంది. అటుపై అఖిల్‌తో సినిమాపై కొరటాల పూర్తి స్థాయిలో కాన్సన్‌ట్రేట్ చేస్తారు. ఎన్టీఆర్- కొరటాల సినిమాని తెరకెక్కించనున్న సుధాకర్ అఖిల్ చిత్రాన్ని నిర్మిస్తారని ఇదివరకూ వార్తలొచ్చాయి. ఈ ఏడాది ద్వితీయార్థంలోనే అఖిల్ ? కొరటాల సినిమా సెట్స్‌కెళ్లే అవకాశం ఉందని, అఖిల్ సినిమా తర్వాత ఎన్టీఆర్‌తో కొరటాల సినిమా ఉంటుందని తెలుస్తోంది.

Comments
Post a Comment