కనిపెంచిన తల్లిదండ్రులు రుణం తీర్చుకునేవాళ్లు ఎందరు? ఈ హైఫై యుగంలో బంధాలు, బాంధవ్యాలు తగ్గిపోతున్నాయి. అంతే వైఫైలో కబుర్లు..చాటింగ్‌లో పలకరింపులు..వాట్సప్‌లో 'రిప్' అంటూ మెసేజ్‌లు. ఓ తండ్రి కోసం.. ఆయన మానసిక స్థితి సరిగా లేని సమయంలో తోడుగా ఉండిపోయాడా కొడుకు. అతడే గుండు హనుమంతరావు తనయుడు ఆదిత్య. ఎదిగిన వయసొచ్చాక..మంచి అవకాశం వస్తే ఎక్కడికైనా వెళ్లిపోవాలని చూస్తారు. కెరీర్‌కు ఉన్న ఇంపార్టన్స్ అంది. చాలా మంది ఇలాంటి అవకాశాలు కోసం ఎదురు చూస్తుంటారు. గుండు హనుమంతరావు తనయుడు ఆదిత్యకు మంచి అవకాశం వచ్చింది. అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసుకున్నాడు. మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అదే సమయంలో తల్లి, సోదరి చనిపోవడంతో తండ్రి గుండు హనుమంతరావు ఒంటరివాడయ్యాడు. మానసికంగా కుంగిపోయాడు. సినిమాలకు దూరమయ్యాడు. అప్పుడప్పుడు బ్రహ్మానందం తదితర స్నేహితులకు ఫోన్ చేసి బాధపడేవాడు. ఈ క్రమంలో తండ్రిని కంటికి రెప్పలా కాపాడుకోవాలని భావించాడు ఆదిత్య. అంతే అమెరికాలో గొప్ప ఉద్యోగం వదిలేసి ఇండియాకు వచ్చేశాడు. తండ్రిని చిన్నపిల్లాడు మాదిరిగా చూసుకున్నాడు. వ్యాధి ముదిరిపోవడం..మానసిక క్షోభతో గుండు హనుమంతరావు తీరని లోకాలకు తరలిపోయాడు. ఆ మరణాన్ని తట్టుకోలేకపోతున్నాడు ఆదిత్య. ఈ విషయం తెలిసిన బంధువులు, సినిమా వాళ్లు కూడా ఆదిత్యను ఓదార్చడం కష్టతరమైంది. హనుమంతరావుకు 'దేవుడు మంచి కొడుకును ఇచ్చాడు' అంటూ చాలా మంది పేర్కొన్నారు.

Comments
Post a Comment