'అ'దిరింది

మన మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి నిర్మాతగా మారి వాల్‌పోస్టర్‌ బ్యానర్‌పై నిర్మించిన 'అ' చిత్రం శుక్రవారం విడుదలైంది. విడుదలైన అన్ని కేంద్రాల్లో సూపర్బ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. కాజల్‌ అగర్వాల్‌, నిత్యానన్‌, రెజీనా, ఈషా రెబ్బా, శ్రీనివాస్‌ అవసరాల, ప్రియదర్శి, మురళి శర్మ తదితరులు ముఖ్యపాత్రలలో ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన చిత్రం 'అ!'. ఇందులో నటించిన కాజల్‌ అగర్వాల్‌, నిత్యానన్‌, రెజీనా, ఈషా రెబ్బా, శ్రీనివాస్‌ అవసరాల, ప్రియదర్శి, మురళి శర్మల పాత్రలు అద్భుతంగా పండాయి. మంచి ఫీల్‌ గుడ్‌తో మూవీ రన్‌ అయింది. ఇప్పటికే ప్రీమియర్‌ షో చూసిన పలువురు నాని తన టాలెంట్‌ చూపించాడని ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. నాని హ్యాట్సాఫ్‌ అంటూ బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ, మధుర శ్రీధర్‌రెడ్డితో పాటు నటులు అడవి శేషు, శశాంక్‌, అనుమప పరమేశ్వరన్‌, నీరజ కోన, వెన్నెల కిశోర్‌ ట్విట్టర్‌లో అభినందించారు. శుక్రవారం రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. నిత్యామీనన్‌, కాజల్‌, రెజీనా ఎంట్రీలు అదిరిపోయాయి. సస్పెన్స్‌తో కూడిన ఈ చిత్రం ఎక్కడా బోర్‌ కొట్టకుండా ఆసక్తిగా తెరకెక్కించిన దర్శకుడు శశాంత్‌ వర్మ తన టాలెంట్‌ ఏంటో టాలీవుడ్‌కు తొలి సినిమాతోనే నిరూపించాడు. అలాగే కొత్త కథలతో ముందుకొస్తే 'అ' సినిమాలెన్నో నిర్మిస్తానని ఇప్పటికే నాని ప్రకటించాడు. సినిమాపై ఎంతో నమ్మకం వ్యక్తం చేస్తూ వచ్చిన నాని అంచనాలు ఎక్కడా మిస్‌ అవ్వలేదు.

Comments