గుండు హనుమంతరావు మృతి
ప్రముఖ హాస్యనటుడు గుండు హనుమంతరావు కన్నుమూశారు. గత కొద్దికాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. సోమవారం ఉదయం 3:30 గంటలకు హైదరాబాద్ ఎస్‌ఆర్‌నగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు హుటాహుటిన ఎర్రగడ్డ సెయింట్ థెరిసా హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. దాదాపు 400 సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా సంపాదించుకోలేదు. చివరకు చికిత్స చేయించుకునేందుకు కూడా డబ్బులు లేని పరిస్థితి ఏర్పడింది. ఇటీవల పలువురు దాతలు ముందుకు వచ్చి ఆయన కిడ్నీ ఆపరేషన్‌కు సహకరించారు. అయినా ఆరోగ్యం మెరుగవ్వకపోవడంతో మృతి చెందారు.
61 ఏళ్ల గుండు హనుమంతరావు తెలుగు చిత్రసీమలో మేటి కమెడియన్‌గా దశాబ్ధం పైగానే హవా సాగించారు. దాదాపు 400 సినిమాల్లో నటించిన అనుభవజ్ఞుడు. బుల్లితెరపై గుండుకు 'అమృతం' సీరియల్ గొప్ప పేరు తెచ్చింది. మూడుసార్టు టీవీ నందులు అందుకున్నారు. ఆయన చివరి రోజుల్లో ఆర్థిక పరంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుండటంతో మెగాస్టార్ చిరంజీవి ఆయన వైద్య ఖర్చుల కోసం రూ.2లక్షలు అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం రూ. ఐదు లక్షలు అందజేసింది. మా అసోసియేషన్ ఆర్థిక సహాయం అందించడం విశేషం.
1956లో కాంతారావు, సరోజిని దంపతులకు హన్మంతరావు జన్మించారు. 1974లో నాటకరంగం వైపు ఆకర్షితుడయ్యాడు. నాటకాల్లో ఆయన వేసిన మొదటి వేషం రావణబ్రహ్మ. మద్రాసులో ఓసారి ఓ నాటకంలో గుండును చూసిన జంధ్యాల 'అహనా పెళ్లంట' సినిమాలో తొలి అవకాశం ఇచ్చారు. తర్వాత కొబ్బరిబోండాం, మాయలోడు, యమలీల, వినోదం సినిమాలతో మంచి హస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 50 సినిమాలు నటించిన తరువాత తన నివాసం విజయవాడ నుంచి హైదరాబాద్‌కు మార్చారు. పలు టీవీ సీరియల్స్‌లో నటించారు .హనుమంత రావుకు భార్య, ఇద్దరు పిల్లలుండగా ఇదివరకే కూతురు, భార్య చనిపోయారు. ఆనారోగ్యం కారణంగానే కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్నారు.. సినిమాలకు ముందు హన్మంతరావు స్వీట్ షాపును నిర్వహించేవారు.
సినిమాల్లో తన కామెడీతో అందరినీ నవ్వించిన గుండు హనుమంతరావు వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించారు. 2010లో భార్య చనిపోవడం, ఆ తర్వాత కూతురు కూడా దూరమవడంతో ఆయన మానసికంగా బాగా కుంగిపోయారు. ప్రస్తుతం హనుమంతరావుకు ఓ కొడుకు ఉన్నాడు. ఎన్నో సినిమాల్లో నటించినా ఆర్థికంగా కూడా ఆయనకు కష్టాలు తప్పలేదు. కిడ్నీ సమస్యలు రావడంతో వైద్యం కోసం ఎంతో ఖర్చు చేశారు.

Comments
Post a Comment