హైదరాబాద్: సీనియర్ నటుడు దేవదాస్ కనకాల సతీమణి లక్ష్మీదేవి కన్నుమూశారు. అనారోగ్యంతో శనివారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె మృతిపట్ల పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు, ఆర్టిస్టులు సంతాపం తెలిపారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ('మా') అధ్యక్షుడు శివాజీ రాజా, ప్రధాన కార్యదర్శి వి.కె. నరేష్ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. దేవదాస్ కుమారుడు రాజీవ్ కనకాల అందరికీ సుపరిచితుడు. సుమ దేవదాస్ కనకాలకు కోడలు. దేవదాస్ అనేక సినిమాల్లో నటించారు. నాటక రంగంలో కూడా ఆయన రాణించారు. ఓ యాక్టింగ్ స్కూల్‌ను కూడా నడిపారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల దాన్ని మూసివేశారు. నటుడు రజీవ్ కనకాల దేవదాస్-లక్ష్మీదేవిల కుమారుడన్న సంగతి తెలిసిందే. లక్ష్మీదేవి మృతి వార్త విని టాలీవుడ్ నటులు తరలివచ్చారు. పలువురు దేవదాస్ కనకాలను ఓదార్చారు. అలాగే బుల్లితెర నటులు దేవదాస్ ఇంటికి వచ్చారు.

Comments
Post a Comment