ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులను కలవరానికి గురి చేసిన ఓ ఘటన చోటు చేసుకుంది. సెంచూరియన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో వన్డేలో 9 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 20.3 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయిన టీమిండియా 119 పరుగులు చేసింది. ప్రపంచమంతా ఎంతో ఉత్సాహంతో భారత క్రికెటర్స్ అద్భుతమైన ప్రదర్శనను వీక్షిస్తున్న సందర్భంలో హఠాత్తుగా బీసీసీఐ వెబ్ సైట్ అదృశ్యం కావడంపై అంతా షాక్ కు గురి కావాల్సి వచ్చింది. కాగా ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన వెబ్ సైట్ బిసిసిఐ.టివి. ఇలాంటి వెబ్ సైట్ సమయానికి బిల్ చెల్లించి అప్ డేట్ చేసుకోకపోవడంతో ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. దీంతో క్రికెట్ ప్రపంచాన్నే తీవ్ర ఉత్కంఠలో ముంచెత్తింది. సహజంగా.. ఫిబ్రవరి 2, 2006 నుండి ఫిబ్రవరి 2, 2019 వరకు ఈ డొమైన్ కాల పరిమితి ఉంది. కానీ ఆ వెబ్ సైట్ ను ఫబ్రవరి 3, 2018 లోపు అప్ డేట్ చేసుకోవాలి. దీంతో బోర్డ్ అధికారులు, సాంకేతిక నిపుణుల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో? వెంటనే గుర్తించక రసవత్తరమైన పోరు మధ్యలో ఒక్కసారిగా బిసిసిఐ.టివి వెబ్ సైట్ ఆగిపోయింది. ఇది తెలియడంతో నెట్టింట్లో క్రికెట్ అభిమానులు బిసిసిఐపై పంచ్ లు పేలుస్తున్నారు. ఎంతో సంపన్నమైన సైట్ కడుపేదరికంలో పొర్లాడుతూ? డొమైన్ కూడా అప్ డేట్ చేసుకోలేని స్థాయిలో ఉంది అంటూ కామెంట్లు గుప్పిస్తున్నారు.

Comments
Post a Comment