షకీలా.. శృంగార తారగా పేరు. కేవలం మలయాళ ప్రేక్షకులకే కాదు.. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు అత్యంత బాగా సుపరిచితం. ఒకప్పుడు శృంగార రస సినిమాలతో మలబారు తీరాన్ని ఒణికించిన ఈ అమ్మడు అటుపై కెరీర్ పరంగా అవకాశాల్లేకపోవడంతో రూటు మార్చింది. తెలుగు సినిమాల్లో వ్యాంప్ తరహా పాత్రల్లోనూ నటించింది. రీసెంటుగా తేజ దర్శకత్వంలో పలు చిత్రాల్లో నటించిన షకీలా.. మరోసారి స్ట్రెయిట్ నాయికగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సినిమా పేరు 'శీలవతి'. శృంగార తారగా తన ఇమేజ్‌కి రివర్శ్ టైటిల్ ఇదన్న సంగతి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. సినిమాని సినిమాలానే చూడాలని ఇటీవలే 'శీలవతి' ప్రమోషన్స్‌లో మహిళామణులకు క్లాస్ పీకింది షకీలా. ఈలోగానే 'శీలవతి' టీజర్ రిలీజైంది. టీజర్ ఆద్యంతం ఆసక్తి రేకెత్తిస్తోంది. అయితే ఇది షకీలా జోనర్ కాదే అన్న సందేహాన్ని రేకెత్తించింది. ఇటీవల హారర్ జోనర్ వేగంగా వైరల్ అవుతోంది. అదే పంథాలో షకీలాతో చేసిన ప్రయోగం అని అర్థమవుతోంది. అయితే 'వాట్ ది ఫ' అనే క్యాప్షన్ ఇచ్చారు కాబట్టి ఈ సినిమాలో ఇంకేదో ఉందన్న సంకేతం అందింది. సాయిరామ్ దాసరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్లలో రానుంది. ఓ ఖరీదైన భవంతి.. ఆ భవంతిలో ఓ ఇద్దరు పిల్లలతో మిడిలేజీ మహిళ.. పైన ఆకాశంలో మెరుపులు ఉరుములు..! ఆ సీన్‌లో ఏం జరగనుందో 'శీలవతి'లో చూడాలి.

Comments
Post a Comment