వర్మకు కొత్త చిక్కులు

హైదరాబాద్‌ : సంచనాల రాంగోపాల్‌ వర్మపై ఉచ్చుబిగిస్తోంది. జీఎస్టీతో విపరీతమైన హైప్‌ క్రియేట్‌చేసిన వర్మకు ఇప్పుడు ఎదురు దెబ్బ తగిలేలా ఉంది. గాడ్‌ సెక్స్‌ అండ్‌ ట్రూత్‌ వెబ్‌ సిరిస్‌తో మహిళా నేతల విమర్శలు ఎదుర్కొన్న వర్మపై పోలీసు కేసు కూడా నమోదయింది. దీనిపై సైబర్‌ క్రైం పోలీసులు వీన్యూ వెబ్‌ సైట్‌కు లేఖ రాశారు. దీనిపై స్పందించిన వెబ్‌సైట్‌ నిర్వాహకులు జీఎస్టీని వెబ్‌సైట్‌ నుంచి తొలగించినట్టు సైబర్‌ క్రైం అడిషనల్‌ డీసీపీ రఘువీర్‌ చెప్పారు. అయితే గాడ్‌ సెక్స్‌ అండ్‌ ట్రూత్‌ డాట్‌ కామ్‌ వెబ్‌ సైట్‌లో ఈ సినిమా అందుబాటులో ఉందని తెలిసి .. ఆ సైట్‌ వారికి కూడా లెటర్‌ రాశామని.. రిప్లై కోసం వెయిట్‌ చేస్తున్నామని రఘువీర్‌ చెప్పారు. పూర్తి ఆధారాలు సేకరించిన తరువాత రాంగోపాల్‌ వర్మను విచారిస్తామని డీసీపీ రఘువీర్‌ చెప్పారు.

Comments