ఆమె ఆటలోనే కాదు ప్రసవంలోనూ పోరాడింది. నల్ల కలువ పిల్లగా..టెన్నిస్ తారగా కోట్లాది మంది అభిమానులున్న స్టార్ సెరెనా విలియమ్స్ మాతృత్వం కోసం తాపత్రయ పడింది. అందరిలాగే ప్రసవ వేధన అనుభవించింది. కాకాపోతే సెరెనా ప్రాణాలకు తెగించింది. తన పాప తన పాప ఒలింపియా కోసం తాను మృత్యువుతో పోరాడాల్సి వచ్చిందని దాదాపుగా చనిపోయాననే అనుకొన్నానని వైద్యుల అంకితభావం, ప్రావీణ్యం కారణంగానే తాను బతికానని ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకొంది. ప్రసవసమయంలో తాను ఊపిరితిత్తుల్లో గడ్డలతో బాధపడ్డానని ఊపిరి అందక బీపీ విపరీతంగా పెరిగిపోయిందని వాపోయింది. అత్యవసరంగా సిజేరియన్ చేయటం ద్వారా తాను పాపకు జన్మనివ్వగలిగానని ఆరువారాలపాటు ఎలా బ్రతికానో ఇప్పటికీ తనకు అంతు పట్టడం లేదని చెప్పింది. 23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విజేత సెరెనా ప్రస్తుతం తన కూతురు చిన్నారి ఒలింపియాతోనే ఎక్కువసమయం గడుపుతూ ఓ తల్లిగా మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తోంది.

Comments
Post a Comment