విశ్వనటుడు కమల్‌హాసన్ పూర్తిస్థాయి రాజకీయనాయకుడిగా మారబోతున్నారు. బుధవారం సాయంత్రం పార్టీ పేరును ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో తన రాజకీయ యాత్రను బుధవారం ప్రారంభించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సమాధిని దర్శించుకున్నారు. కలాం సమాధికి అంజలి ఘటించారు. అబ్దుల్ కలాం ఇంటికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను కలిశారు.తర్వాత అక్కడి నుంచి కమల్ రాజకీయ యాత్రను ప్రారంభించారు. యాత్రలో భాగంగా రామేశ్వరం, పరమకొడి, మదురైలో జరిగే బహిరంగ సభల్లో కమల్ పాల్గొని ప్రసంగించనున్నారు. సాయంత్రం మదురైలో జరిగే సభలో పార్టీ పేరును, జెండాను ఆవిష్కరించనున్నారు. పార్టీ ప్రారంభ వేడుకకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హాజరు కానున్నారు.

Comments
Post a Comment