అప'కీర్తి'

కీర్తి సురేష్‌ ...అందం... అభినయానికి మారు పేరు. నేను శైలజా అంటూ పలకరించింది. నేను లోకల్‌ అంటూ మెప్పించింది. చూడముచ్చటైన ఆమె చిరునవ్వు. అమాయకత్వంతో కూడిన నటన అందర్నీ ఫిదా చేస్తోంది. అజ్ఞాతవాసి చిత్రంతో పవన్‌ కళ్యాణ్‌ సరసన నటించే లక్కీ ఛాన్స్‌ కొట్టేసింది. కానీ అజ్ఞాతవాసి చిత్ర ఫలితంతో కీర్తికి నిరాశే మిగిలింది. అయినా కూడా ఇప్పటికి కీర్తి సురేష్‌ క్రేజీ హీరోయినే. సావిత్రి బయోపిక్‌ మహానటి వంటి బిగ్‌ ప్రాజెక్ట్‌ కీర్తి చేతుల్లో ఉంది. 
ఈ బొద్దు గుమ్మ క్యారక్టర్‌ మీద ఎలాంటి రిమార్క్స్‌ టాలీవుడ్‌లో వినిపించలేదు. కానీ కోలీవుడ్‌లో మాత్రం పుకార్లు షికార్లు చేస్తున్నాయి. హీరోయిన్ల గురించి మీడియాలో తరచుగా కొన్ని వార్తలు, పుకార్లు వస్తుంటాయి. అన్ని పుకార్లు నమ్మశక్యంగా ఉండవు. కీర్తి సురేష్‌ గురించి కోలీవుడ్‌ వర్గాల్లో ప్రచారం అవుతున్న ఓ వార్త షాక్‌కు గురిచేస్తోంది. కానీ ఇది నిజం అని నొక్కి మరి చెబుతున్నారు. కీర్తి సురేష్‌ సీనియర్‌ నటుల సహనానికి పరీక్ష పెడుతున్నట్లు సమాచారం. షూటింగ్‌లో క్యార్‌ వాన్‌ నుంచి ఒక పట్టాన బయటకు రాదట. కీర్తి కోసం దర్శకుడి నుంచి సీనియర్‌ నటుల వరకు అంతా పడిగాపులు కాస్తున్నా కీర్తి మాత్రం ఆలస్యంగా క్యార్‌ వాన్‌ దిగుతుందని అంటున్నారు. కీర్తి ఇలా ప్రవర్తించడానికి కారణం ఆమెలో స్టార్‌ హీరోయిన్‌ అనే భావన పెరిగిపోవడం వల్లనే అని కోలీవుడ్‌ వర్గాలు విమర్శలు గుపిస్తున్నాయి. మేకప్‌ పేరుతో గంటల తరబడి క్యార్‌ వాన్‌ లోనే ఉండిపోతే షూటింగ్‌ పరిస్థితి ఏంటని కోలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో అంతర్గతంగా కీర్తి గురించి విమర్శలు వినిపిస్తున్నాయి.

Comments