ఇక్కడమ్మాయిలు..అక్కడబ్బాయిలు


 
ఇండస్ట్రీలో అఫైర్స్‌ లేని హీరోయిన్స్‌ ఉంటారా? అయితే హీరోలు, లేదా బిజినెస్‌ మెన్స్‌తో ప్రేమాయణం నడిపేది కొందరైతే బయటి వ్యక్తులను ప్రేమించి పెళ్లి చేసుకునేవారు ఇంకొందరు. అయితే ఈ రెండు కోవలకు చెందిన ముద్దు గుమ్మలూ ఉన్నారు. వారెవరో.. వారి ప్రేమ కథేంటో ఇప్పుడు చూసేద్దాం. 
స్వదేశీ తారలంతా విదేశీ యువకులను ఇష్టపడుతున్నారు. ఇప్పటికే ప్రేమలో ఉన్నది కొందరైతే.. ఆల్‌రెడీ పెళ్లి చేసుకున్నవాళ్లు ఇంకొందరు. లోకనాయకుడు కమల్‌హసన్‌ గారలపట్టి శృతీహసన్‌కి బాలీవుడ్‌, టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వగానే సక్సెస్‌ రాలేదు. కొంత హార్డ్‌ వర్క్‌ తరువాత, కొన్ని సినిమాల తరువాత తెలుగులో గబ్బర్‌సింగ్‌ సినిమాతో హిట్‌ వచ్చింది. గబ్బర్‌సింగ్‌తో ఐరన్‌ లెగ్‌ కాస్తా.. గోల్డెన్‌ లెగ్‌గా మారి.. వరుస ఆఫర్లు అందిపుచ్చుకుంది. స్టార్‌ హీరోయిన్స్‌ లిస్ట్‌లో చేరింది. అయితే ఇండస్ట్రీలోకి రాగానే అమ్మడు సిద్ధార్థ్‌తో అఫైర్‌ సాగించిందనే టాక్‌ వచ్చింది. 'అనగనగా ఓ ధీరుడు' సినిమాతో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందన్నారు. ఆ తరువాత బ్రేకప్‌ అయిందనే గుసగుసలు వినిపించాయి. పాత కథంతా పక్కన పెడితే.. శృతి ఓ విదేశీ కుర్రాడితో డేటింగ్‌ చేస్తుందనే న్యూస్‌ చక్కర్లు కొడుతోంది. ఆ యువకుడి గురించి ఆరాతీస్తే లండన్‌కు చెందిన థియేటర్‌ ఆర్టిస్ట్‌ మైఖెల్‌ కొర్సల్‌ అని తెలిసింది. శృతీహసన్‌, మైఖెల్‌ మధ్య కొంతకాలంగా పరిచయం ఉందని, అప్పుడప్పుడు ముంబైలోని శృతి అపార్ట్‌మెంట్‌కు వచ్చి వెళ్తుంటాడని ప్రచారం జరుగుతోంది. అయితే మైఖెల్‌, శృతి మాత్రం మొదటిసారి లండన్‌లో కలిశారట. బ్రిటీష్‌ ఆల్టర్‌నేటీవ్‌ రాక్‌బాండ్‌తో కలిసి రికార్డింగ్‌ కోసం లండన్‌ వెళ్లినప్పుడు మైఖెల్‌ అక్కడ పరిచయం అయ్యాడని, ఇద్దరూ ఒకరికొకరు నచ్చడం, అభిప్రాయాలు కలవడంతో చాలా క్లోజ్‌ అయ్యారని టాక్‌. సాధారణంగా శృతీహసన్‌ తన పర్సనల్‌ విషయాల గురించి మాట్లాడటానికి పెద్దగా ఇష్టపడదు. ఇప్పుడూ ఇదే పద్దతి ఫాలో అవుతుంది. విూడియాలో ఎంత ప్రచారం జరుగుతున్నా అమ్మడు మాత్రం నోరు మెదపడం లేదు. 
గోవా బ్యూటీ ఇలియానా సంగతి సరేసరి. పదేళ్లుగా ఇండస్ట్రీలో ఉంది. టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా వెలిగింది. ఇప్పుడైతే బాలీవుడ్‌ వెళ్లిపోయింది కానీ.. ఇప్పటికీ తెలుగువారు ఆమెను మర్చిపోలేదు. టాలీవుడ్‌లో ఓ హీరో హ్యాండిచ్చాడని, తనపై కోపంతోనే తెలుగు ఇండస్ట్రీని వదిలి పోతుందన్నారు. అయితే బాలీవుడ్‌లో తొలి అడుగే కలిసి రావడంతో అమ్మడు మళ్లీ టాలీవుడ్‌ను పట్టించుకోలేదు.? బాలీవుడ్‌లో ఆఫర్ల సంఖ్య తక్కువైనా అన్నీ హిట్స్‌ కావడం కలిసొచ్చింది. పెళ్లి విషయంలోనూ అమ్మడు ఏదో సీక్రెట్‌ మెయింటెన్‌ చేస్తుందనే గుసగుసలు వినిపించాయి. ఆస్ట్రేలియా ఫోటోగ్రాఫర్‌ ఆండ్రూ నిబోన్‌తో ప్రేమాయణం సాగిస్తున్న ఇల్లీ బేబీ సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందన్నారు. ఆ హాడావుడి జరగడానికి కారణం లేకపోలేదు. క్రిస్ట్‌మస్‌ చెట్టును అలంకరిస్తున్న ఓ ఫోటోను పోస్ట్‌ చేసి ఈ పండుగ నాకెంతో ప్రియమైంది. నా భర్త ఆండ్రూ నిబోన్‌ తీసిన ఫోటో ఇది అంటూ కామెంట్‌ చేసింది. ఎంత ప్రచారం జరిగినా.. గోవా బ్యూటీ మాత్రం లైట్‌ తీసుకుంది. పెళ్లి తన వ్యక్తిగత వ్యవహారం అని దాని గురించి బయట మాట్లాడటం ఇష్టం లేదని తేల్చి చెప్పేసింది. మొత్తానికి ఇద్దరూ ఆస్ట్రేలియాలో పెళ్లి చేసుకున్నారా? లేక త్వరలో చేసుకోబోతున్నారా? అనేది చర్చ కొనసాగుతోంది. ఏదేమైనా టాలీవుడ్‌లో హీరో చేతిలో మోసపోయానన్న గోవా బ్యూటీ ఆస్ట్రేలియా బాయ్‌ఫ్రెండ్‌తో ఎంజాయ్‌ చేస్తోంది. 
విదేశీ కుర్రాళ్లపై మోజుపడి ప్రేమాయణం సాగిస్తున్నవారు.. పెళ్లి చేసుకుని జీవితం గడుపుతున్నవారి సంఖ్య పెద్దదే ఉంది. అసలు ఈ ట్రెండ్‌ 80ల్లోనే మొదలైంది. సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటా పెళ్లి విషయంలో చాలా దాగుడుమూతలాడింది. ఎట్టకేలకు అమెరికన్‌ వ్యాపారవేత్త జీన్‌గుడ్‌ ఎనఫ్‌తో మూడుముళ్లు వేయించుకుంది. దిల్‌ సే సినిమాతో బాలీవుడ్‌ ఇండస్ట్రీతో అడుగుపెట్టిన ప్రీతి జింటా.. తెలుగులో ప్రేమంటే ఇదేరా, రాజకుమారుడుతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే పెళ్లివరకు ప్రీతి చాలామందితో ప్రేమ వ్యవహారాలు నడిపింది. అయితే ఎవరితోనూ ఎక్కువ కాలం సంబంధాన్ని కొనసాగించలేకపోయింది. నెస్వాడియా, ప్రీతిజింటా మధ్య ఉన్న సంబంధం అప్పట్లో హాట్‌ టాపిక్‌ అయింది. ఇద్దరు కలిసి ఐపీఎల్‌ పంజాబ్‌ టీమ్‌కు కో-ఓనర్లుగా ఉన్నారు. కొంతకాలం తరువాత విడిపోయారు. ఐపీఎల్‌ పంజాబ్‌ టీమ్‌లో గతంలో ఆడిన యువరాజ్‌ సింగ్‌తోనూ అమ్మడికి అఫైర్‌ ఉందనే ప్రచారం జరిగింది. తన భర్త శేఖర్‌ కపూర్‌తో ప్రీతి జింటా ప్రేమ వ్యవహారమే తమను వేరు చేసిందని సుచిత్ర కృష్ణమూర్తి సంచలన ఆరోపణలు చేశారు. ఆ తరువాత మోడల్‌ మార్క్‌ రాబిన్‌సన్‌తో డేటింగ్‌ చేసిందనే పుకార్లూ వచ్చాయి. ఎట్టకేలకు దేశీ బాయ్‌ఫ్రెండ్స్‌ అందరికీ టాటా చెప్పేసి అమెరికా స్నేహితుడు జీన్‌గుడ్‌తో బంధానికి ముందడుగు వేసేసింది. రెండేళ్ల క్రిత్రం లాస్‌ఏంజెల్స్‌లో అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది. ఈ పెళ్లి కూడా పబ్లిక్‌గా జరగలేదు. బాలీవుడ్‌ ప్రముఖులు కబీర్‌ బేడీ, సుష్మితా సేన్‌, ఫరాఖాన్‌ ట్విట్టర్‌లో ప్రకటించాక విషయం బయటపడింది.


Comments