ఇటీవల కేరళలో ఓ వ్యక్తి బాహుబలి సినిమాలోని ఏనుగు ఫీట్ చేద్దామనుకుని కంగుతిన్న సంగతి తెలిసిందే. తాజాగా కేరళలో మురుగన్ అనే వ్యక్తి ఏకంగా సింహాలతోనే చిట్‌చాట్ చేయాలనుకున్నాడు. అనుకున్న వెంటనే మురుగన్ ఉదయం 11:45 గంటల సమయంలో సెక్యూరిటీ గార్డుకు తెలియకుండా సందర్శకులను తోసుకుంటూ తిరువనంతపురం జూలోకి ప్రవేశించాడు. మురుగన్ చేష్టలతో ఆశ్చర్యానికి లోనైన జూ సందర్శకులు ఈ విషయాన్ని అధికారులకు తెలియజేశారు. జూ అధికారులు అక్కడికి చేరుకుని మురుగన్‌ను బయటకు తీసుకొచ్చారు. మురుగన్‌ను కేరళలోని పాలక్కాడ్ వాసిగా గుర్తించారు. వారం రోజుల క్రితం మురుగన్ తన ఇంటి నుంచి పారిపోయి వచ్చాడు. ఆ తర్వాత అతని కుటుంబసభ్యులు మురుగన్ కోసం మీడియాలో ప్రకటనలు కూడా ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. లయన్ ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లే క్రమంలో మురుగన్‌కు స్వల్పగాయాలయ్యాయని..అతనిని ఆస్పత్రిలో చేర్పించామని జూ అధికారి ఒకరు వెల్లడించారు. అదృష్టవశాత్తూ మురుగన్ బతికిబయటపడ్డాడు. ఏమాత్రం సింహాలు మురుగన్ చూసినా దాడి చేసేవి.

Comments
Post a Comment