ఒక్క కన్నుగీటుతో ఇంత సీనా!


ఒక్క కన్నుగీటుతో వరల్డ్‌వైడ్‌ పాపులారిటీ సంపాదించడమెలా? .. ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే ప్రియా వారియర్‌ను అడగాల్సిందే. ఓవర్‌నైట్‌లో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిపోయిన ఈ భామ అసాధారణ ఫాలోయింగ్‌తో చర్చల్లోకొచ్చింది. సన్నీలియోన్‌, అనుష్క శెట్టి, జుకర్‌బర్గ్‌ అంతటి ప్రముఖుల్ని మించిపోయేలా సామాజిక మాధ్యమాల్లో ఫాలోవర్స్‌ను పెంచుకుంది. సరిగ్గా ఇదే పాయింట్‌ ఈ అమ్మడికి గొప్పగా కలిసొస్తోంది. ప్రియా తమ బ్రాండ్‌కు గొప్ప అంబాసిడర్‌ కాగలదని భావించిన పలు కార్పొరెట్‌ కంపెనీలు తనతో డీల్స్‌ సెట్‌ చేసుకుంటున్నాయి. ప్రియా వారియర్‌కు సామాజిక మాధ్యమాల్లో ఉన్న ఫాలోయింగ్‌ దృష్ట్యా ఒక్కో ట్వీట్‌కు రూ.10లక్షలు చెల్లించేందుకు పలు కార్పొరెట్‌ కంపెనీలు ఒప్పందం చేసుకున్నాయని తెలుస్తోంది. మరోవైపు ప్రియా వారియర్‌కు సినిమా ఛాన్సులు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో సినిమాకి అడ్వాన్సుల రూపంలోనే లక్షల్లో అందుకుంటోందిట. 'ఒరు ఆధార్‌ లవ్‌' చిత్రంలో తన పాత్ర పరిధిని రెట్టింపు చేసేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేశారని తెలుస్తోంది. ఒక్క కన్నుగీటుతో ఇంత సీనుంటుందని ప్రియానే ఊహించి ఉండదు కదూ?

Comments