వెన్నెలైనా.. చీకటైనా.. చేరువైనా.. దూరమైనా







అతిలోక సుందరికి స్వర నీరాజనం 

వెన్నెలైనా.. చీకటైనా.. చేరువైనా.. దూరమైనా 
నీతోనే జీవితము.. నీ ప్రేమే శాశ్వతము 
ఏ జన్మదో ఈ బంధము.. ఏ జన్మదో ఈ బంధము 
నింగి నేల సాక్ష్యాలు.. నింగి నేల సాక్ష్యాలు 
ప్రేమకు మనమే తీరాలు..అని మనసు ప్రేమ కురిపించింది. ఇప్పుడు ఎవరు పంచుతారు ఆ ప్రేమను... 
పేరు చెప్పనా నీ రూపు చెప్పనా..నీ పేరే అనురాగం 
నీ రూపము శృంగారము..నీ చిత్తమూ నా భాగ్యము 
పేరు తెలుసునూ నీ రూపు తెలుసును..నీ పేరే ఆనందం 
నీ రూపము అపురూపము..నీ నేస్తాము నా స్వర్గము 
పేరు చెప్పనా నీ రూపు చెప్పనా..పువ్వుల చెలి నవ్వొక సిరి 
దివ్వెలేలనే నీ నవ్వు లుండగా..మమతల గని మరునికి సరి 
మల్లె లేలారా నీ మమతలుండగా..నీ కళ్ళలో నా కలలనే పండనీ 
నీ కలలలో నన్నే నిండనీ..మనకై భువి పై దివి నే దిగనీ.. 
ఎవరిలో చూడాలి నీ రూపు..నా చెలి ఎవరికి చెప్పాలి నీ నవ్వులు ప్రత్యక్షంగా చూడలేమని.. 
ఓ¬ కన్నెపిల్లవని కన్నులున్నవని 
యెన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ 
లల లల లల లలలలల 
లలలల లలలల లాలల 
చిన్ననవ్వు నవ్వి వన్నేలన్ని రువ్వి 
యెన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి 
కన్నెపిల్లవని కన్నులున్నవని 
యెన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ 
చిన్ననవ్వు నవ్వి వన్నేలన్ని రువ్వి..అందుకేనేమో నీ వగలు చూసి ఆ బ్రహ్మ కన్నుకుట్టింది. 
కుడికన్ను కొట్టగానే కుర్రాణ్ణి... ఎడం కన్ను కొట్టగానే ఎర్రోణ్ణి 
కుడికన్ను కొట్టగానే కుర్రాణ్ణి... ఎడం కన్ను కొట్టగానే ఎర్రోణ్ణి 
ఆ రెండు కళ్ళు కొట్టరాదా... నన్ను రెచ్చగొట్టి చూడరాదా 
వంకాయ్‌.. ¬య్‌.. ¬య్‌ 
కుడికన్ను కొట్టగానే కుర్రోడా... ఎడంకన్ను కొట్టుకుంది పిల్లోడా 
కుడికన్ను కొట్టగానే కుర్రోడా... ఎడంకన్ను కొట్టుకుంది పిల్లోడా..శ్రీ..నీ కళ్లు చూసి సినీ ప్రేమికులంతా బానిసలయ్యారు. ఇప్పు ఆ కళ్లు ఇక కనిపించవు అనే బాధను ఎలా తట్టుకోవాలి..నువ్వే చెప్పు శ్రీ.. 
అందమా అందుమా అందనంటే అందమా 
చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా 
ప్రాణమున్న పైడిబొమ్మ పారిజాత పూలకొమ్మ 
పరవశాలు పంచవమ్మ పాల సంద్రమా 
అందమా అందుమా అందనంటే అందమా 
చైత్రమా చేరుమ్మ చేరనంటే న్యాయమా 
ప్రాణమున్న పైడిబొమ్మ పారిజాత పూలకొమ్మ 
పరవశాలు పంచవమ్మ పాల సంద్రమా 
ఆడుమా పాడుమా మౌనమే మానుకోవమ్మ..ఓ దేవ కన్యా మా కోసం పరితపించావు..మమ్మల్ని అలరిచేందుకు ఎన్నెన్నో చేశావు. అందమా అందుమా..అందనంటే అందమా..అంటూ అందని లోకాలకు వెళ్లిపోతే ఎలా ఇంద్రజ.. 
దేవి మౌనమా.. శ్రీదేవి మౌనమా 
దేవి మౌనమా.. శ్రీదేవి మౌనమా 
నీకై జపించి జపించి తపించి తపించు భక్తుని పైనా 
దేవి మౌనమా.. శ్రీదేవి మౌనమా 
దేవి మౌనమా.. శ్రీదేవి మౌనమా 
మౌన భంగము.. మౌన భంగము 
భరియించదు ఈ దేవి హృదయము 
ప్రేమ పాఠము.. ప్రేమ పాఠము 
వినకూడదు ఇది పూజా సమయము 
దేవి హృదయము విశాలము.. భక్తునికది కైలాసము 
హే దేవి హృదయము విశాలము.. భక్తునికది కైలాసము 
కోరిక కోరుట భక్తుని వంతు... అడగక తీర్చుట దేవత వంతు 
ధూపం వేయుట భక్తుని వంతు... పాపం మోయుట దేవుని వంతు 
పాపానికి మోక్షం ధూప దర్శనం... ఈ ప్రాణికి మోక్షం నామ స్మరణం.. నీ నామ స్మరణం 
దేవీ... దేవీ... దేవీ... దేవీ...అంటూ ఇక పాడుకోవడమేనా? నువ్వు మళ్లీ వస్తానంటే ఎన్ని సార్లైనా పాడుతాం..గొంతెత్తి.. 
జాము రాతిరి జాబిలమ్మ..జోల పాడనా ఇల.. 
జోరు గాలిలో జాజి కొమ్మ..జార నీయకే కలా 
వయారి వాలు కళ్ళలోన..వరాల వెండి పూల వాన 
స్వరాల ఊయలూగు వేళ..జాము రాతిరి జాబిలమ్మ 
జోల పాడనా ఇలా..కుహు కుహు సరాగాలే సృతులుగా 
కుశలమా అనే స్నేహం పిలువగా.. 
కిల కిల సవిూపించే సడులతో..ప్రతి పొద పదాలేవో పలుకగా 
కునుకురాక బుట్టబొమ్మ గుబులుగుందని 
వనము లేచి వద్దకొచ్చి నిద్ర పుచ్చని... 
జాము రాతిరి జాబిలమ్మ..జోల పాడనా ఇలా 
మనసులో భయాలన్నీ మరిచిపో..మగతలో మరో లోకం తెరుచుకో 
కలలతో ఉషా తీరం వెతుకుతూ..నిదరతో నిషారాణి నడిచిపో..నువ్వలేని..నీ నవ్వులే ఉన్నాయి..నువ్వు లేవు..నీ రూపం మదిలోనే ఉంది. మరో లోకంలో మా ప్రేమనూ తీసుకుని హాయిగా విహరించు మిత్రమా..

Comments