సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. అవి ఏ స్థాయిలో అంటే కోట్లకు కోట్లు కొల్లగొట్టేంత. దీనిపై ఎన్ని రకాలుగా ప్రచారం చేసినా సైబర్ దొంగలు కొత్త పంథాలో దోచుకుంటున్నారు. దీనిపై స్పందించిన దర్శకధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి ఓ షార్ట్‌ఫిల్మ్‌ను నిర్మించారు. హైదరాబాద్ సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు వీరిద్దర్నీ పెట్టి షార్ట్ ఫిల్మ్ తీశారు. దీనికి రాజమౌళి దర్శకత్వం వహించారు.
సిటీ పోలీసుల ఆధ్వర్యంలో రూపొందిన ఈ ఫిల్మ్ సోమవారం (ఫిబ్రవరి-19) నుంచి థియేటర్లతో పాటు సోషల్ మీడియా ద్వారా ప్రజల మధ్యకు వెళ్లింది. సోమవారం (ఫిబ్రవరి-19) హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వి.వి.శ్రీనివాసరావు ఈ సినిమా థియేటర్‌లో దీన్ని విడుదల చేశారు. రోజుకో రకంగా వెలుగుచూస్తున్న సైబర్ మోసాలపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు యాడ్ ఫిలింలో నటించారు ఎన్టీఆర్, రాజమౌళి.

Comments
Post a Comment