విడుద‌లైన కొద్ది సేప‌టికే...

పైరసీభూతం వీడడం లేదు. ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా ఆగడం లేదు. గతంలో సినిమా విడుదలకు ముందే పైరసీ నెట్‌ ఇంట్లో హల్‌ చేయగా..ఇప్పుడు మన రకూల్‌ ప్రీత్‌ సింగ్‌ బాలీవుడ్‌లో నటించిన 'ఐయారి' రిలీజ్‌ అయిన కొద్ది సేపట్లోనే మార్కెట్లోకి వచ్చేసింది. మరీ విడ్డూరంగా..ఈ మూవీని ఆర్టీసీ బస్సులో ప్లే చేయడం అందరికి షాకింగ్‌గా మారింది. ప్రభుత్వ సంస్థలలో ఇలాంటి పనులు జరుగుతుంటే ఎవరు పట్టించుకోకపోవడం ఎంత దారుణం అంటూ నిర్మాతలు ఫైర్‌ అవుతున్నారు. వివరాలలోకి వెళితే టాలీవుడ్‌ లో వరుస ఆఫర్లతో దూసుకెళుతున్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇటీవల బాలీవుడ్‌కి కూడా వెళ్లింది. నీరజ్‌ పాండే డైరెక్షన్‌ లో సిద్ధార్థ్‌ మల్హోత్రాకు జోడీగా 'ఐయారి' సినిమా చేసింది. 2018 ఫిబ్రవరి 16న ఈ చిత్రం విడుదలైంది. సైనిక అధికారి అభియాన్‌ సింగ్‌ం మేజర్‌ జయ్‌ బక్సీల బయోగ్రఫీగా ఈ చిత్రం తెరకెక్కగా, ఇందులో మనోజ్‌ బాజ్‌ పాయ్‌, నసీరుద్దీన్‌ షా, అనుపమ్‌ ఖేర్‌ లు కీలక పాత్రలలో నటించారు. 'ఐయారి' సినిమా ఫిబ్రవరి 16న విడుదల కాగా, ఫిబ్రవరి 19న ఉదయం 7.30 గంటల సమయంలో ముంబై నుండి గోవాకి వెళ్ళే మహారాష్ట్రరోడ్డు రవాణా సంస్థకి చెందిన బస్సులో పైరసీ చిత్రం ప్రదర్శితమైంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న బస్సులో ఇలా పైరసీ సినిమా ప్రత్యక్షం కావడంతో అందరు షాక్‌ అయ్యారు. కొద్ది సేపటికే ఈ విషయం చిత్ర నిర్మాత జయంతిలాల్‌ గడకి చేరింది. వెంటనే ఆయన చట్ట ప్రకారం సదరు బస్సు సంస్థపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ సంఘటనపై బాలీవుడ్‌ పరిశ్రమకి చెందిన పెద్దలు ఫైర్‌ అవుతున్నారు.

Comments