వేసవి సినిమా ఫన్‌డుగా వచ్చేసింది. వారం వారం వరుసుగా క్రేజీ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ వేసవి అంతా సినిమా పండుగే. జేబులో పర్సు నిండుగా ఉండాలే కానీ..దండీగా దండుకోవడానికి డజనుకు పైగా సినిమాలు రెడీగా ఉన్నాయి. ఇవన్నీ క్రేజీ సినిమాలే కావడం విశేషం. మార్చి నుంచి మే వరకూ బోలెడు సినిమాలు అలరించేందుకు రెడీ అవుతున్నాయి.
ముందుగా సాయిపల్లవి ప్రధాన పాత్ర పోషించిన 'కణం' మార్చి 3న రిలీజవుతోంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన హారర్ సినిమా ఇది. ఆ తర్వాత నిఖిల్ హీరోగా నటించిన 'కిరాక్ పార్టీ' మార్చి 16న రిలీజవుతోంది. మార్చి 23న 'రాజరథం', మార్చి 29న 'మహానటి' రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న 'మహానటి' భారీ క్రేజుతో రిలీజవుతోంది. ఆ తర్వాత రామ్‌చరణ్ 'రంగస్థలం' మార్చి 30న రిలీజవుతుంది. విశాల్ 'అభిమన్యుడు' మార్చిలోనే రిలీజ్ కానుంది. నితిన్ 'ఛల్ మోహన్ రంగ' ఏప్రిల్ 5న, నాని 'కృష్ణార్జున యుద్ధం' ఏప్రిల్ 12న రిలీజవుతున్నాయి. ఆ తర్వాత మహేష్ 'భరత్ అనే నేను' ఏప్రిల్ 20న, రజనీకాంత్ 'కాలా' ఏప్రిల్ 27న, బన్ని 'నా పేరు సూర్య' మే 4న రిలీజవుతున్నాయి. వరుసగా ఈ మూడు సినిమాలు భారీ క్రేజుతో భారీ హైప్‌తో బరిలో దిగుతున్నాయి. సాక్ష్యం, పంతం, దండుపాళ్యం 3, ఆచారి అమెరికా యాత్ర సినిమాలు ఇదే సీజన్‌లో రిలీజవుతున్నాయి. భరత్ అనే నేను-100-130కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ పూర్తి చేసుకుని అత్యంత క్రేజీగా రిలీజవుతోంది. నా పేరు సూర్య -100 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్, రంగస్థలం- 100 కోట్లు పైగా ప్రీరిలీజ్ బిజినెస్‌తో భారీ హైప్‌లో వస్తున్నాయి. రజనీకాంత్ 'కాలా'- తెలుగు, తమిళ్ కలిపి 150కోట్లు పైగా ప్రీరిలీజ్ బిజినెస్ పూర్తి చేసుకుని అంతే భారీగా రిలీజ్ కానుంది. ఈ సీజన్‌లో ఇతర సినిమాలన్నీ కలిపి 200 ప్లస్ కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ తో భారీ అంచనాల నడుమ రిలీజ్ కానున్నాయి. ఇవన్నీ కలిపి 1000-1200 కోట్లు పైగా వసూలు చేయాల్సిన సన్నివేశం ఉంది. అంటే ఈ వేసవి సీజన్‌లో కేవలం రెండు నెలల వ్యవధిలోనే 1000 కోట్లు పైగా పందేరం నడుస్తోందన్నమాట!

Comments
Post a Comment