నన్నునడిపిస్తున్నది అనుష్కయే..
దేశం ఏదైనా ఆయనది ఒకటే స్టైల్..బౌలర్ ఎవరైనా అదే ఊచకోత..కొడితే దిమ్మదిరిగిపోయేలా...మైండ్ బ్లాక్ అయ్యేలా సెక్సీగా కొడుతూ టీమిండియాకు వరుస విజయాల్లో తన మార్కును..ఇజాన్ని ప్రదర్శిస్తున్న విరాధివీరుడు వీరాట్ కోహ్లీ. పరాజయాలకు కుంగిపోడు. ప్రశంసలకు పొంగిపోడు..ఎంతకైనా సై అంటాడు.. ఎక్కడైనా నెగ్గుతాడు.. ఒక్కసారి కిందపడినా.. గోడకు కొట్టిన బంతిలా తిరిగి దూసుకొచ్చే నైజం.. ఆస్ట్రేలియా ఆటగాళ్లే అసూయ పడేలా పొగరు చూపించిన పోటుగాడు.. దూకుడులో బాహుబలి అంతటివాడు..ఆటలో రాటుదేలిన వీరుడు. దిగ్గజాలతో పోలికే లేదు..తనకు తనే టార్గెట్. ఆ టార్గెట్‌ను నిత్యం జయిస్తూనే ఉంటాడు.
దక్షిణాఫ్రికా గడ్డపై వన్డే సిరీస్ గెలిచి మూడు దశాబ్ధాల కలను సాకరం చేసిన విరాట్ కోహ్లీ, జట్టును విజయవంతంగా నడిపిస్తూ..భారత కెప్టెన్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. మిగతా నాయకులతో పోలిస్తే కోహ్లీది ప్రత్యేక స్థానమని వేరే చెప్పనవసరం లేదు. ఇప్పటికే ఆటగాడిగా, నాయకుడిగా తానేంటో నిరూపించాడు. విదేశాల్లో సిరీస్ గెలుపు కష్టసాధ్యమనుకున్న వేళ చరిత్ర సృష్టించాడు.
వన్డేల విషయానికొస్తే 48 మ్యాచ్‌ల్లో 37 విజయాలు, 10 పరాజయలతో మంచి రికార్డును నమోదు చేశాడు. ఇతని విజయాల శాతం 78.72గా ఉంది. గత కెప్టెన్ల విజయాల సగటు 60కి మించలేదు. ధోనీ ఒక్కడే 59.57 శాతంతో ఇతని తర్వాతి స్థానంలో ఉన్నాడు. ద్రవిడ్ 56, కపిల్‌దేవ్ 54, గంగూలీ 53 శాతం విజయాలు నమోదు చేసి ఉత్తమ కెప్టెన్లుగా నిరూపించుకున్నారు. కానీ విరాట్ వీరందరినీ తోసిరాజని ఇప్పుడు అత్యుత్తమ నాయకుడిగా ఎదుగుతున్నాడు.
ధ్వైపాక్షిక సిరీస్‌లో మూడు సెంచరీలు బాది ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్న కోహ్లీకి ప్రపంచవాప్తంగా ప్రశంసలు వర్షం కురుస్తోంది. ఇదిలావుండగా నన్ను ఇంతలా ఆటను ఆస్వాదించేలా చేస్తున్నది ముమ్మాటికీ మై స్వీట్ హార్ట్ అనుష్కశర్మ. ఔట్ ఫీల్డ్‌లో నా ఆటతీరుపై నిరంతరం ఉత్సాహవంతమైన వాతావరణం కల్పిస్తూ ప్రోత్సహించడమే నా ఆట మెరుగుకు కారణం. గతంలో కూడా చాలా మంది అనుష్కను విమర్శించారు. బట్ నా విజయంలో ఆమె పాత్ర ఎంతో ఉంది. ఐ లవ్యూ అనుష్క, అంటూ మ్యాచ్ ముగిసిన తరువాత వీరాట్ పేర్కొనడం విశేషం.

Comments
Post a Comment