పక్కా మతతత్వ దేశంగా ఇన్నాళ్లూ ముద్రపడిన సౌదీ అరేబియా క్రమంగా తన వైఖరిని మార్చుకుంటోంది. ముఖ్యంగా మహిళలకు కట్టుబాట్లు ఎక్కువ. స్వేచ్ఛగా మెలిగే అవకాశం లేదు. అయితే ఇటీవల ఆ వైఖరి మారుతూ వస్తోంది. మహిళలు డ్రైవింగ్ చేయకూడదని ఆంక్షలు విధించిన సౌదీ అరేబియా..ఆ నిషేధాన్ని ఎత్తేసింది. అన్ని రంగాల్లో మహిళలకూ ప్రాధాన్యత ఇవ్వాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఆ దేశంలో మహిళ స్వేచ్ఛపై మాట్లాడేవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. తాజాగా సౌదీ అరేబియా చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా అక్కడ 'అరబ్ ఫ్యాషన్ వీక్'ను నిర్వహిస్తున్నారు. సౌదీ రాజధాని రియాద్‌లో మార్చి 26 నుంచి 31 వరకు ఈ ఈవెంట్ ఏర్పాటు కాబోతోంది. దీనివల్ల పర్యాటక రంగాన్ని మరింత ఆకర్షించడంతో పాటు.. మహిళలకు సమాన సాధికారతను కల్పించినట్టవుతుందని భావిస్తోంది సౌదీ ప్రభుత్వం.

Comments
Post a Comment