చిన్నారుల కోసం రేవతి ఏం చేసింది?

రేవతి..చిన్న అమ్మాయే..కాని చాలా పెద్ద మనసు. అందుకే ఆ విద్యార్థిని అందరికీ ఆదర్శప్రాయమైంది. మురికి కాల్వల పక్కన బాల్యం మధురానికి దూరంగా నివసిస్తున్న వారిని చూసి ఆ పసి హృదయం తల్లడిల్లిపోయింది. వారిలో వెలుగులు నింపాలని భావించింది. ఇంతకీ రేవతి ఏం చేసింది. పేదల పిల్లలను ఎలా తీర్చిదిద్దింది? వివరాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే. 
రేవతిది మదనపల్లి నియోజకవర్గంలోని నిమ్మనపల్లి మండలం దివిటివారిపల్లి గ్రామం. 8వ తరగతి చదువుతోంది. పల్లెటూరి నుంచి మదనపల్లి వచ్చి అమ్మమ్మ, తాతయ్యల దగ్గర చదువుకుంటూ.. బాలల హక్కుల కోసం పోరాటం చేస్తున్నది. చైల్డ్‌ రైట్స్‌ అండ్‌ యు (క్రై), పీపుల్స్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (పీఓఆర్‌డీ) వంటి సంస్థలతో కలిసి పనిచేస్తున్నది. ఇంటింటికీ తిరుగుతూ బాలల హక్కుల గురించి అవగాన కల్పిస్తున్నది. పై చదువుల కోసం పట్నమొచ్చిన రేవతి, ఆమె చెల్లి.. మురికివాడల్లో పిల్లల దుర్బర జీవితాలను చూసి చలించారు. పిల్లలను రక్షించడానికి వారి హక్కులను కాపాడడానికి స్వచ్ఛంద సంస్థలతో పనిచేస్తూ.. వారితో కలిసిపోరాడుతున్నది. బాల్యవివాహాలు, బాల కార్మికులు, నిర్బంధ విద్యపై పిల్లల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా స్కిట్స్‌ రూపొందించి.. వాటిలో నటిస్తున్నది.

Comments

Post a Comment