హిజ్రాగా సేతుపతి

ప్రయోగాలు ఎక్కువగా చేసే తమిళ సినీ పరిశ్రమలో ఇప్పుడు మరో న్యూస్‌ ఇంట్రస్టింగ్‌గా మారింది. తమిళంలో విజయ్‌ సేతుపతికి చాలా క్రేజ్‌ ఉంది. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ పేరు బాగా సుపరిచితం . మెగాస్టార్‌ 151వ చిత్రం సైరాతో విజయ్‌ సేతుపతి టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నాడు. విజయ్‌ సేతుపతి తమిళంలో పలు చిత్రాలలో వెరైటీ ప్రయోగాలు చేశాడు. తాజాగా సూపర్‌ డీలక్స్‌ అనే మూవీ కోసం లేడీ గెటప్‌ వేశాడు. రెడ్‌ కలర్‌ శారీలో.. బొట్టుపెట్టుకుని సాంప్రదాయబద్ధంగా కనిపిస్తున్న విజయ్‌ సేతుపతి ఈ చిత్రంలో ట్రాన్స్‌జెండర్‌గా కనిపించనున్నాడు . ఈ పాత్ర పేరు శిల్ప కాగా, ఎక్కువ మేకప్‌ లేకుండా లేడీ గెటప్‌ లో ఈ మాస్‌ హీరో ఒదిగిపోయిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇక మరో హీరో ఉన్నిముకుందన్‌ కూడా హిజ్రా పాత్రలో కనిపించేందుకు సిద్ధమయ్యాడు. జనతాగ్యారేజ్‌, భాగమతి' చిత్రాలతో తెలుగులోనూ తనకంటూ ఓ గుర్తింపుని సంపాదించుకున్న మలయాళ హీరో 'చాణక్య తంత్రం' అనే చిత్రంలో హిజ్రా తరహా పాత్రలో కనిపించబోతున్నాడు. కరిష్మా అనే పేరుతో ఈ సినిమాలో కనిపించనున్న ఉన్ని పోస్టర్స్‌ ఇప్పుడు సోషల్‌ విూడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. హిజ్రా అనగానే ఏదో మేకప్‌ వేసుకుని కనిపించడమే అనుకుంటే పొరబాటే. ఈ పాత్ర కోసం ఉన్ని ప్రత్యేకంగా ప్రొస్తేటిక్స్‌ కూడా వాడాడట.

Comments