'పెళ్లి చేసుకోవాలని ఉంది..పిల్లలను కనాలని ఉంది' అంటూ స్వీటీ భాగమతి తన మనసులో మాట చెప్పింది. అయితే ఎవర్ని చేసుకుంటుందో మాత్రం ఇంకా సీక్రెట్ మెంటైన్ చేస్తోంది. బాహుబలి చిత్రం తరువాత పెళ్లి చేసుకుంటుందని రూమర్లు షికార్లు చేశాయి. ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటుందని కూడా ప్రచారం బాగా జరిగింది. అయితే ఇవేమీ నిజాలు కావని అటు అనుష్క..ఇటు ప్రభాస్ ఇద్దరు ఖండించారు కూడా..తాజాగా భాగమతితో సెన్సేషనల్ హిట్ కొట్టిన అనుష్క..తన ఆనందాన్ని మీడియాతో పంచుకుంది. ''బాహుబలి తర్వాత పెళ్లి గురించిన వార్తలు రావడంతో ఒత్తిడి పెరిగింది. కుటుంబ సభ్యులు కూడా పెళ్లి చేసుకోమని కోరుతున్నారు. మీడియా అంతటా ఇదే ప్రశ్న. పెళ్లి గురించి రూమర్లు పుట్టుకస్తున్నాయి. నాకు వివాహవ్యవస్థపై నమ్మకం, విశ్వాసం ఉంది. కానీ సరైన సమయంలో వివాహం చేసుకొంటాను. నాకు పిల్లలంటే చాలా ఇష్టం. పెళ్లి చేసుకుని, పిల్లల్ని కనాలని ఉంది. అలాగని ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోలేను. నా మనసుకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకొంటున్నాను. అందుకు అమ్మానాన్నల సపోర్టు ఉంది. సమయం రావాల్సి ఉందింకా'' అని తెలిపింది. ఓవరాల్‌గా 50 కోట్ల వసూళ్లు తెచ్చిన భాగమతి ఓవర్సీస్‌లోనూ 10 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టనుంది. ఇప్పటికే 7 కోట్లు వసూలైందని తెలుస్తోంది. ఈ చిత్రంతో అనుష్క ఓవర్సీస్ క్వీన్‌గా నిరూపించుకోవడం హాట్ టాపిక్ అయ్యింది.

Comments
Post a Comment