శ్రీదేవి మృతిపై 'వంద'అనుమానాలు

ఏ రిలేషన్‌నైనా డబ్బే చెడగొడుతుంది. శ్రీదేవి మరణంలోనూ ఇదే జరిగిందా? అంటే అవుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీదేవి పేరిట రూ.100 కోట్ల ఇన్సూరెన్స్‌లు ఉన్నాయి. ఆస్తుల పంపకాలపై గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని వాదన. దీనిపైనే దుబాయ్‌ జరిగిన పెళ్లిలో చర్చలకు వచ్చినట్టు..ఆ సమయంలో శ్రీదేవిని ఘోరంగా అవమానించారని, అందుకే అందాల తార మనస్థాపానికి గురైందని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా తొలి భార్య పిల్లలకు తన ఆస్తిలో వాటా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడని, అది శ్రీదేవికి కోపం తెప్పించాయని తెలుస్తోంది. శ్రీదేవితో పెళ్లి జరిగేటప్పటికి బోనీ దగ్గర పెద్దగా ఆస్తులేం లేవు. శ్రీదేవి వల్లే.. బోనీ ఆస్తులు కూడగట్టుకున్నాడన్ని మరో వాదన వినిపిస్తుంది. 'ఈ ఆస్తులన్నీ నావే. కాబట్టి నా పిల్లలకే చెందాలి' అని శ్రీదేవి గట్టిగా చెప్పేదని, సరిగ్గా అదే గొడవ దుబాయ్‌ పెళ్లిలోనూ జరిగిందని, 'ఆస్తులపై ఓ క్లారిటీ వచ్చేంత వరకూ దుబాయ్‌ విడిచి రాను' అని శ్రీదేవి భీష్మించుకుని కూర్చుందని, కోపంతో దుబాయ్‌ నుంచి ముంబై వచ్చేసిన బోనీ.. మళ్లీ శ్రీదేవిని బుజ్జగించడానికి దుబాయ్‌ వెళ్లాడని, అక్కడ మరోసారి గొడవ చోటుచేసుకుందని రకరకాల కథలు, కథనాలు పుడుతున్నాయి. వీటిలో ఏది నిజం అనేది మాత్రం ఇంకా తెలియడం లేదు. దుబాయ్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ ఈ కేసుని చాలా సీరియస్‌గా తీసుకుంది. శ్రీదేవి మరణంపై అన్ని కోణాల్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగానే బోనీ కపూర్‌ని గట్టిగా విచారిస్తోంది. అయితే బోనీ సన్నిహితులు మాత్రం 'ఇదేం ఇన్వెస్టిగేషన్‌ కాదు.. కేవలం సమాచారం రాబట్టడానికి మాత్రమే.. బోని ప్రశ్నిస్తున్నారు' అని చెబుతున్నారు. బోనికి అత్యంత సన్నిహితులు, స్నేహితులు? ప్రస్తుతం బోనీకి దూరంగా ఉన్నారని, వాళ్లెవ్వరూ ఇప్పుడు దుబాయ్‌లో లేరని తెలుస్తోంది. బోని పాస్‌ పోర్ట్‌ ని దుబాయ్‌ పోలీసులు తీసేసుకోవడం, ఇప్పటికీ శ్రీదేవి పార్థీవ దేహాన్ని అప్పగించకపోవడం, బోనిని గంటల తరబడి ప్రశ్నిస్తూనే ఉండడం.. ఇవన్నీ బోలెడన్ని సందేహాలు కలిగిస్తున్నాయి.

Comments