కన్నుకొట్టి..హార్ట్‌బీట్‌ చేసి..

కన్ను కొట్టింది..సెకన్లపాటు మురిపించింది..కవ్వించింది. యూత్‌కు ఇంతకంటే ఏంకావాలి? యూట్యూబ్‌ షేక్‌ అయింది. నవతరం ఉప్పొంగింది. ఆ ముత్యాల పువ్వే ప్రియా వారియర్‌. రాత్రికి రాత్రే సెలెబ్రిటీ అయిపోంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఓ వీడియోతో కోట్లాది మంది హృదయాలను మీటింది. ప్రియావారియర్‌ 2000 సంవత్సరంలో పుట్టింది. సరిగ్గా 18 ఏళ్ల యువరాణి. పాటలు పాడడం, ట్రావెలింగ్‌ చేయడం, డ్యాన్స్‌ చేయడం హాబీ. ప్రియ పూర్తి పేరు ప్రకాశ్‌ వారియర్‌. ప్రకాశ్‌ వాళ్ల నాన్న పేరు. వెండితెరపై ప్రియా వారియర్‌గా ఫేమస్‌ అయింది. ఓ చిన్న వీడియో లక్షల మంది వీక్షించడంతో ప్రియా వారియర్‌గా పేరు పదిలం చేసుకుంది. ప్రయా ముద్దు పేరు ప్రియూగా పిలుస్తారు. చుట్టాలు, స్నేహితులు ప్రియా అంటారు. ఆమె ఒక పెద్ద సినిమా చేస్తున్నా.. ఇప్పటికీ ఎవరికీ తెలియదు. తెలిసింది ఒక్కరోజులోనే. ఆ క్రెడిటంతా సోషల్‌విూడియాదే. ప్రియ కూడా సోషల్‌విూడియాలో యాక్టివ్‌గానే ఉంటుంది.

Comments