భాగమతి భలే నచ్చింది

భాగమతిలో అనుష్క రేంజ్‌ ఆకాశమంత పెరిగిపోయింది. ఈ స్వీటీ స్టార్‌ హీరోలకు పోటీగా నిలుస్తోంది. భాగమతి అంచనాలకు మించి హిట్‌ అవడం..సినిమా మొత్తం అనుష్క తన భుజస్కందాలపై నడిపించడంతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అద్భుత నటనతో రోజురోజుకూ బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం పెంచుకుంటూ పోతోంది. నిన్న రాంచరణ్‌- ఉపాసన సినిమా చూసి ఫిదా అయిపోయారు. 'ఉపాసనకు రాత్రంతా' నిద్రపట్టలేదు..భాగమతే కలలోకి వచ్చింది' అంటూ చరణ్‌ చెప్పడం ఈ సినిమా ఎంత ప్రభావం చూపుతోంది అర్థమవుతుంది. తాజాగా తలైవా..తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ మన జేజమ్మకు అభినందనలు తెలిపారు. రీసెంట్‌గా రజనీకాంత్‌ స్వయంగా ఫోన్‌ చేసి భాగమతి సినిమాలో అనుష్క నటనను మెచ్చుకున్నారు. ఈ విషయం స్వయంగా అనుష్కయే ఓ ప్రమోషనల్‌ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. రజనీకాంత్‌ నుంచి సర్‌ ప్రైజ్‌ కాల్‌ రావడమే కాకుండా నటన బాగుందచి చెప్పడం చాలా థ్రిల్‌కు గురిచేసిందని తెలిపింది. యువీ క్రియేషన్స్‌ బ్యానర్‌ పై పిల్ల జమిందార్‌ ఫేం అశోక్‌ డైరెక్షన్‌లో వచ్చిన భాగమతి సినిమా ఇప్పటికే బ్రేక్‌ ఈవెన్‌ దాటి బయ్యర్లకు లాభాలు పంచింది.

Comments