నిజమే అజ్ఞాతవాసే

స్ట్రిప్ట్‌ అందలేదా? 
'పచ్చ' జెండా ఊపలేదా? 
బడ్జెట్‌పై నోరుమెదపని జనసేనాని


ప్రశ్నించే నాయకుడు ఎక్కడా? నిలదీసే జనసేనాని కనిపించట్లేదేంటి? ట్విట్టర్లో కూడా కనిపించని అభిమాన కథానాయకుడు ఏడీ? కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగి 24 గంటలు అవుతున్నా పత్తా లేని పవర్‌స్టార్‌ కోసం ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సోషల్‌ మీడియాలో సెటైర్లు పడిపోతున్నాయి..అభిమానులు బడ్జెట్‌ అంత ఆశగా ఎదురు చూస్తున్నారు. గుంపులో గోవిందయ్యలా కాకుండా అందరూ మాట్లేడేసిన తరువాత కామెంట్‌ చేస్తే మీడియాలో కూడా కవరేజ్‌ బాగా వస్తుందని ఆగాడా? లేదా..బడ్జెట్‌పై అంత అవగాహన లేదా? లేదా ఏం మాట్లాడితే మిత్రులతో ఏం ఇబ్బంది వస్తుందని ఆలోచిస్తున్నాడా? స్ట్రిప్ట్‌ అందక..'పచ్చ' జెండా ఊపని కారణంగా నోరు మెదపడం లేదా? ఎన్నో ప్రశ్నలు?? చెప్పాలి కదా జవాబు.. రాజకీయంలోకి వచ్చాక అందరూ టార్గెట్‌ చేస్తారు..ఎన్నో ప్రశ్నలు వేస్తారు? మరెన్నో కామెంట్లూ చేస్తారు. మరి వాటిలో ముఖ్యమైన వాటికైనా సమాధానం చెప్పాలి కదా!! మరేం రావడం లేదు. వినపడుతుందా? ప్రశ్నలు వినిపిస్తున్నాయా?? ఎందుకో ఆ మౌనం..నీకో జెండా ఉంది. అజెండా కూడా ఉందని నిన్ననే కదా చెప్పావ్‌...రా బయటకు వచ్చి ఏపీకి అన్యాయం చేసినవాళ్లను నిలదీయు..అభిమానులను గెలుచుకో...అభిమానించేవాళ్లను మోసం చేయకు...ఇప్పటికీ నువ్వు బయటకు రాకపోతే..అభిమానులు మెచ్చుకోవచ్చు..జనం మాత్రం ధ్వేషించక తప్పదు. ఓ అజ్ఞాత వాసి..ఏదో ఒకటి మాట్లాడు..

Comments