అంతా నేనే ..

అందుకే షాకిచ్చిన జైట్లీ
ట్రంప్‌ను గెలిపించింది నేనే 
పీవీ సింధుకి టెన్నిస్‌లో శిక్షణ ఇచ్చింది నేనే.. 
చంద్రుడికి వెలుగునిచ్చింది నేనే 
సూర్యుడికి కాంతినిచ్చింది నేనే.. 
బాలయ్యకు డ్యాన్స్‌ నేర్పించింది నేనే.. 
బాహుబలికి కథ అందించిందీ నేనే.. 
ఇవాంకకు రాజకీయ శిక్షణ ఇచ్చిందీ నేనే.. 
విదేశాల్లో ఏపీ ఖ్యాతిని పెంచిందీ నేనే.. 
వేల కోట్ల ఎంవోయూలు కుదుర్చుకున్నదీ నేనే 
బిల్‌గేట్స్‌కు మైక్రోసాఫ్ట్‌ ఆలోచన ఇచ్చింది నేనే... 
అందుకే జైట్లీ జెల్ల కొట్లాడు... 


ఇలా చెప్పుకుంటున్నది ఆయనే కనుకే..బడ్జెట్‌లో ఏపీకి నిధులు కేటాయిస్తే..ఆ ఘనత కూడా నాదేనని చెప్పుకుని..కమలానికి పువ్వులు పెట్టేసే ఘనుడు కనుక..జైట్లీ ఆ 'నేనే'కు దిమ్మతిరిగేలా షాక్‌ ఇచ్చాడు. కేంద్రంతో చెలిమి...చక్రం తిప్పే చంద్రుడు..ఇంకేం బడ్జెట్‌లో గొప్ప కేటాయింపులు ఉంటాయని ఏపీ ఎంపీలు ఆహో..ఓహో అని గొప్పలకు పోయారు. ఇప్పుడేమైంది. ఢిల్లీ ఐస్‌ ముక్క ఇచ్చి ఏపీ మొత్తం పంచుకోమన్నట్టు ఉంది వ్యవహారం. మర్చిపోయాం జేసీ దివాకర్‌ రెడ్డి మొన్ననే చెప్పాడు కదా...మన ఎంపీలు దద్దమ్మలు..సిట్‌ అంటే సిట్‌..స్టాండ్‌ అంటే స్టాండ్‌ అంతకు మించి చేసిందేమీ లేదు.. మీడియా ముందు గొప్పలు చెప్పుకునేందుకు మాత్రమే మన ఎంపీలు పనిచేస్తారని..జేసీ చెప్పింది అక్షర సత్యమని బడ్జెట్‌ సాక్షిగా స్పష్టమైంది. ఓటుకు నోటు కేసు దగ్గర నుంచి తెలుగుదేశం మదిలో మోడీ భయం పట్టుకున్నట్టు ఉంది. అందుకే కమలనాథులు కవ్వించే చర్యలు చేపడుతున్నా...మౌనంగా నవ్వుతూనే ఉన్నారు. వీరి మౌనం..లోపాయకారి వ్యవహారం కారణంగా ఏపీ సర్వ నాశనం అవుతున్నా ఏమీ పట్టనట్టు ఉండడంతో ప్రజలు మండిపోతున్నారు. సీఎం కాన్ఫరెన్స్‌లో కూడా ఎంపీలంతా అసంతృప్తి వ్యక్తం చేసినా..ఇంకా ఎందుకో చంద్రన్న ఊరుకోండి...సమయం కోసం వేచి చూద్దాం అన్నట్టు పేర్కొన్నారట. అంతా అయిపోయిన తరువాత మన ఎంపీలకు ఇప్పుడు కోపం రావడం చూస్తుంటే వీరికి రాష్ట్రంపై ఉన్న ప్రేమ, అభిమానం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఎవరి బిజినెస్‌లు వారివి..ఎవరి ఒప్పందాలు వారివి..అందుకే గట్టిగా మాట్లాడలేరు..గట్టిగా నిలదీయలేరు. అందుకే బడ్జెట్‌లో జైట్లీ ఏపీని కరివేపాకులా తీసిపారేశారు. రాష్ట్రంలో వామపక్షాలు, ప్రజలు రగిలిపోతున్నారు. విశాఖ రైల్వే జోన్‌పై మాట కూడా ఎత్తని కేంద్రం తీరు..వారికి సపోర్టు చేస్తున్న టీడీపీ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో వారం రోజులపాటు ఇలా ఆగ్రహావేశాలు..బంద్‌లు..రాస్తారోకోలు..కామన్‌ పాయింట్‌..ఈలోగా బాబు అస్త్రం బయటకు వస్తుంది...ఆ అస్త్రం పేరు జనసేనాని...అంతే కదా..సీన్‌..


Comments