ఒక్క ట్వీట్‌..రూ.8వేల కోట్లపై ప్రభావం

సోషల్‌ మీడియాలో సెలబ్రెటీల ప్రభావం అంతా ఇంతాకాదు. నిత్యం నెట్‌ఇంట్లో ఉండే సెలబ్రెటీలకు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కూడా ఎక్కువగానే ఉంటుంది. వాళ్లు చేసిన ట్వీట్ల కోసం అభిమానులు ఎదురు చూస్తుంటారు. సెలబ్రెటీల ట్వీట్లకు ప్రభావం ఎంతలా ఉంటుందో తెలియజేసే సంఘటన ఇది. స్నాప్‌ చాట్‌ గురించి మోడల్‌ జెన్నర్‌ చేసిన ట్వీట్‌ మార్కెట్‌లో వాటి షేర్ల కుప్పకూలిపోవడానికి కారణమైంది. అది అలా ఇలా కాదు ఏకంగా 1.3 బిలియన్‌ డాలర్ల (మన కరెన్సీలో దాదాపు 8వేల కోట్ల వరకూ) నష్టం వాటిల్లింది. రియాలిటీ స్టార్‌ కైలీ జెన్నర్‌..స్నాప్‌ చాట్‌కు గుడ్‌ బై చెప్పేదెవరు? నేననుకుంటున్నారా? అంటూ ట్వీట్‌ చేసింది. అంతే ఆ ట్వీట్‌ తన ప్రతికూల ప్రభావం చూపింది. మార్కెట్‌లో షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి. అయితే కొద్ది నిమషాలకే నా ఫస్ట్‌ లవ్‌..నిన్ను వదిలే ప్రసక్తే లేదు అంటూ ఆమె చేసిన మరో ట్వీట్‌ను ఎవరూ పట్టించుకోలేదు. స్పాప్‌ ఐఎన్‌ సీ షేరు ధర ఆరు శాతానికి పతనమైంది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కైలీ జెన్నర్‌కు సామాజిక మాధ్యమాల్లో మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఫొటో షేరింగ్‌ ప్లాట్‌ ఫామ్‌ అయిన స్నాప్‌ చాట్‌ 2017 డిసెంబర్‌ కార్టర్లో అమెరికా మార్కెట్లో ఫేస్‌బుక్‌ కంటే ఎక్కువ మందిని ఆకర్షించింది. ఇన్‌స్ట్రాగ్రామ్‌తో పోటీ పడలేకపోతున్న స్పాప్‌ చాట్‌లో మార్పులు చేయాల్సిందిగా యూజరు కొంతకాలంగా కోరుతున్నారు. అయితే దీనికి స్పాప్‌ చాట్‌ ఒప్పుకోవడం లేదు.

Comments